- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబు అంత గొప్పోడైతే ఇప్పటివరకూ ఆ పని ఎందుకు చేయలేదు.. బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి సూటి ప్రశ్న
టీడీపీ(TDP) అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు(Chandrababu)పై తెలంగాణ బీఆర్ఎస్(BRS) కీలక నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి(Jagadish Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ(TDP) అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు(Chandrababu)పై తెలంగాణ బీఆర్ఎస్(BRS) కీలక నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి(Jagadish Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అంత గొప్పోడైతే ఎందుకు ఆంధ్రప్రదేశ్‌కు అమరావతిలో ఒక సచివాలయం కట్టలేకపోయాడని ప్రశ్నించారు. ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎందుకు ఒక్క ఇటుక కూడా పెట్టలేదని అన్నారు. అప్పుడు కూడా చంద్రబాబు మోడీ మనిషే.. అయినా నిర్లక్ష్యం చేశారు. అదే ఐదేళ్లలో ఇక్కడ కేసీఆర్(KCR) ఉన్నదాన్ని కూలగొట్టి.. ఐదేళ్లలో అద్భుతమైన కొత్త సెక్రటేరియట్ కట్టారు.
మహా మేధావులం అని చెప్పుకోవడం కాదు.. ఆ మేధావితనాన్ని పనిలో చూపించాలని హితవు పలికారు. ఎందుకు ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు 6 గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నారని అడిగారు. గుజరాత్‌లో కూడా రైతులకు 6 గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నారని గుర్తుచేశారు. దేశంలో కేసీఆర్ ఒక్కటే రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చారని తెలిపారు. మోడీకి రాహుల్ గాంధీ అనే పెద్ద కార్యకర్త దొరికిండు కాబట్టి ఇంకా అధికారంలో ఉన్నాడు.. లేకపోతే ఆయన తెలివికి ఎప్పుడో బ్యాగు తీసుకొని బయల్దేరే వాడని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. కనీసం రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వలేని వాళ్లు కూడా కేసీఆర్‌పై మాట్లాడటం చూస్తుంటే నవ్వొస్తుంది.. కేసీఆర్ మాట్లాడటం స్టార్ట్ చేస్తే.. మోడీ బట్టలు ఊడిపోవడం ఖాయమని సీరియస్ కామెంట్స్ చేశారు.
చంద్రబాబు అంత గొప్పోడైతే ఎందుకు ఆంధ్రప్రదేశ్‌కు ఒక సచివాలయం కట్టలేకపోయిండు, ఎందుకు ఇంకా రైతులకు 6 గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నాడు ?
— Telugu Scribe (@TeluguScribe) May 24, 2025
గుజరాత్‌లో కూడా రైతులకు 6 గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నారు
మోడీకి రాహుల్ గాంధీ అనే పెద్ద కార్యకర్త దొరికిండు కాబట్టి ఇంకా అధికారంలో ఉన్నాడు – మాజీ… pic.twitter.com/WoAypPFzzL






