- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కళ్ల ముందే అయిన వారిని కోల్పోవడం దారుణం.. హరీష్ రావు భావోద్వేగ ట్వీట్
మేడ్చల్(Medchal) జిల్లా దుండిగల్(Dundigal) పరిధిలో జరిగిన హృదయవిదారకమైన రోడ్డు ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) పేర్కొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్(Medchal) జిల్లా దుండిగల్(Dundigal) పరిధిలో జరిగిన హృదయవిదారకమైన రోడ్డు ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) పేర్కొన్నారు. బాలుడి మృతి(Boy Dead)పై సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘అభం శుభం తెలియని ఐదేళ్ల బాలుడు టిప్పర్ చక్రాల కిందపడి చనిపోవడం దారుణం. బాబును కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వారికి కలిగిన నష్టం తీర్చలేనిది.. వారి దు:ఖం తీవ్రమైనదని పేర్కొన్నారు.
‘ఇటీవల నగరంలో జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలు తీవ్ర భయాందోళనలను కలిగిస్తున్నాయి. కళ్ల ముందే అయిన వారిని కోల్పోయిన కుటుంబసభ్యులు భరించలేని మానసిక వేదనకు గురవుతున్నారు. బాధ్యత గల ప్రభుత్వం దీనిపై వెంటనే దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. భారీ వాహనాలను పరిమిత సమయంలోనే నగరంలోకి అనుమతించాలన్న నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలి. ముఖ్యంగా పాఠశాల వేళల్లో భారీ వాహనాలు రోడ్లపై ప్రయాణించకుండా చూడాలి. స్కూల్ జోన్ నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా ఒక అమాయక ప్రాణం దానికి ఖరీదు చెల్లించవలిసి వస్తున్నది. వ్యవస్థాగత వైఫల్యాల వల్లనే, నిబంధనల అమలులో ఉన్న లోపాల వల్లనే రోడ్డు ప్రమాదాల్లో జనం ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా చిన్నారులు ఎక్కువగా బలవుతున్నారు. ట్రాఫిక్ నిబంధనల అమలు, డ్రైవర్లకు తగిన శిక్షణ, మద్యం మత్తులో వాహనాలు నడపకుండా కట్టుదిట్టమైన చర్యలు, ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలు అమలు చేయాలి. ట్రాఫిక్ నిబంధనల పట్ల పౌరులు కూడా అంతే బాధ్యతతో నడుచుకోవాలి. ఒక క్షణం నిర్లక్ష్యం ఖరీదు.. ఒక ప్రాణం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి’ అని సోషల్ మీడియా వేదికగా హరీష్ రావు పేర్కొన్నారు.






