- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BRS: రాంచందర్‌రావు జాక్‌పాట్ ప్రెసిడెంట్
రాంచందర్‌రావు ఓ జాక్‌పాట్ ప్రెసిడెంట్ అని.. వచ్చీ రాగానే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాంచందర్‌రావు ఓ జాక్‌పాట్ ప్రెసిడెంట్ అని.. వచ్చీ రాగానే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అల్లుడు వచ్చి అడుగు పెట్టగానే ఏదో జరిగిందన్నట్లుగానే రాంచందర్‌రావు అధ్యక్షుడు కాగానే రాజాసింగ్ రాజీనామా చేశారని అన్నారు. బీఆర్ఎస్ సత్తా ఏంటో ప్రజలకు తెలుసని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకం ప్రజలకు అర్థమైందని చెప్పారు. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచినా రాష్ట్రానికి చేసింది శూన్యమని ఆరోపించారు. ఏపీ నుంచి ముగ్గురు గెలిచి నిధులు తీసుకెళ్తున్నారని అన్నారు. అలాగే.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని రాంచందర్‌రావు పగటి కలలు కంటున్నారని.. ఆ పార్టీ ఎప్పుడూ మూడో స్థానం కోసం పోటీ పడాల్సిందేనని అన్నారు. ఎంఐఎం కన్నా ఒక్క సీటు ఎక్కువ తెచ్చుకోవాలనేదే బీజేపీ టార్గెట్ అని ఆరోపించారు. లోపాయికారిగా కాంగ్రెస్, బీజేపీ కలిసే పనిచేస్తున్నాయని ఆరోపించారు. పాశమైలారంలో జరిగిన ప్రమాదం అత్యంత విషాదకరమైందని.. మృతుల కుటుంబాలను రాష్ట్రప్రభుత్వం, యాజమాన్యం కలిసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు కె.కిశోర్‌గౌడ్, మన్నె గోవర్ధన్‌రెడ్డి, తుంగ బాలు పాల్గొన్నారు.






