- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తుమ్మలకు రాజకీయ పునర్జన్మ ఇచ్చిందే కేసీఆర్: మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు
సీఎం రమేశ్‌వి పిచ్చి మాటలు అని.. ఆయన మాటలు నమ్మేందుకు ఎవరూ చెవిలో పువ్వులు పెట్టుకోలేదని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రమేశ్‌వి పిచ్చి మాటలు అని.. ఆయన మాటలు నమ్మేందుకు ఎవరూ చెవిలో పువ్వులు పెట్టుకోలేదని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్ అన్నివర్గాలను అక్కున చేర్చుకున్నారని అన్నారు. కేసీఆర్‌కు ఏ కులం పట్ల ద్వేషం లేదని చెప్పారు. తుమ్మలకు రాజకీయ పునర్జన్మ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చిన నేత కేసీఆర్ అని పేర్కొన్నారు. సీఎం రమేశ్ కమ్మల మధ్య తగువు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీజేపీతో మాట్లాడాలనుకుంటే కేసీఆర్ డైరెక్ట్‌గా మాట్లాడతారని.. మధ్యలో ఈయన ఎవరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బ్రోకర్ మాటలు మానుకోవాలని సూచించారు. రేవంత్‌రెడ్డి అన్ని వర్గాలను ముంచినట్టే కమ్మలను సైతం ముంచుతున్నారని ఆరోపించారు. కమ్మలమీద ప్రేమ ఉంటే జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ కమ్మలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కవిత బెయిల్ కోసం కేటీఆర్ తనను నాలుగు నెలల క్రితం కలిశారని సీఎం రమేశ్ అంటున్నారని.. కానీ, కవితకు ఎనిమిది నెలల క్రితమే బెయిల్ వచ్చిందని అన్నారు. దీన్ని బట్టే ఆయన మాట్లాడేవన్నీ అబద్ధాలే అని తేలిపోయిందన్నారు. ఆయన బీజేపీలో ఎందుకు చేరారో అందరికీ తెలుసన్నారు. కాంట్రాక్టుల కోసం ఆయన ఎంతకైనా దిగజారుతారని.. చిల్లర మాటలు మానుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ నేత దినేశ్‌చౌదరి మాట్లాడుతూ.. డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా సీఎం రమేశ్ కేటీఆర్‌ను కమ్మ వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కమ్మలకు ఎన్నో అవకాశాలిచ్చిన పార్టీ బీఆర్ఎస్ అని చెప్పారు. సీఎం రమేశ్, రేవంత్‌రెడ్డి రహస్య భాగస్వాములని ఆరోపించారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో వచ్చిన ఆరోపణలకు ముందు సీఎం రమేశ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.






