- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాల్క సుమన్ అరెస్ట్.. నాంపల్లి కోర్టుకు తరలింపు
సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యలు, హింసను ప్రేరేపించేలా మాట్లాడారనే ఆరోపణలపై బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అరెస్ట్. శనివారం ఉదయం అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టుకు తరలించిన పోలీసులు.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ కీలక నేత బాల్క సుమన్ (Balka Suman)ను పోలీసులు అరెస్టు చేశారు. మూడు రోజుల క్రితం బీఆర్ఎస్ నేతల సమావేశంలో సింగరేణి పై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో అతనిపై పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు నాంపల్లి కోర్టు (Nampally Court)కు తరలిస్తున్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ను వెంటనే అరెస్ట్ చేయాలని, ఆయన లాంటి వ్యక్తులు సమాజంలో ఉండటం అంత మంచిది కాదని శాసన మండలిలో ప్రభుత్వ విప్, బల్మూరు వెంకట్ డీజీపీకి లేఖ ఇచ్చారు. పోలీసులు ఈ అంశాన్ని సుమోటోగా తీసుకోవాలని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా, రెచ్చగొట్టారని వారు ఆరోపించారు.
అసలేం జరిగిందంటే..?
ఇటీవల జరిగిన బీఆర్ఎస్ నేతల సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడుతూ.. నిరసనలు తెలిపేందుకు రైతులు, కార్మికులు రావడం లేదని.. బీఆర్ఎస్ నేతలే మిలిటెంట్ తరహా ఉద్యమం చేయాలని అవసరమైతే రోడ్లపై గొడవలు చేయాలని, సింగరేణి ఆఫీసును, ఆస్తులను ధ్వంసం చేయండంటూ బాల్క సుమన్ కార్యకర్తలకు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో హింసను ప్రేరేపించే ఈ తరహా రాజకీయం ఎంటని రాజకీయ పార్టీ తీవ్రంగా ఖండించాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదులు అందించారు.






