- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గచ్చిబౌలి పోలీసులు వేధిస్తున్నారు.. మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన BRS నేత
బీఆర్ఎస్(BRS) నేత మన్నె క్రిశాంక్(Manne Krishank) మానవ హక్కుల కమిషన్(Human Rights Commission)ను ఆశ్రయించారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) నేత మన్నె క్రిశాంక్(Manne Krishank) మానవ హక్కుల కమిషన్(Human Rights Commission)ను ఆశ్రయించారు. కంచ గచ్చిబౌలి(Kancha Gachibowli) భూముల విషయంలో విచారణ పేరుతో తనను గచ్చిబౌలి పోలీసులు వేధిస్తున్నారని హెచ్‌ఆర్‌సీలో క్రిశాంక్ ఫిర్యాదు చేశారు. ఈ కేసు విషయంలో ఇప్పటికే తనను మూడుసార్లు విచారణకు పిలిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈనెల 23న రావాలని మరోసారి నోటీసులు జారీ చేశారని వెల్లడించారు. దర్యాప్తు పేరుతో ఏమీ విచారణ చేయకుండా సమయం వృథా చేస్తున్నారని ఆవేదన చెందారు.
తన హక్కులకు భంగం కలిగిస్తున్న గచ్చిబౌలి పోలీసు(Gachibowli Police)లపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమిషన్‌ను కోరారు. అంతేకాదు.. తక్షణమే తన విచారణ నిలిపివేసేలా పోలీసులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై ఆయన్ను పోలీసులు విచారిస్తున్నారు. ఫేక్ వీడియోలు వైరల్ చేశారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు విచారణకు హాజరైన క్రిశాంక్.. మరోసారి రావాలని నోటీసులు ఇవ్వడంతో హెచ్‌ఆర్సీని ఆశ్రయించారు.






