- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యేలు ఇంకా బుకాయిస్తున్నారు.. పార్టీ ఫిరాయింపు కేసులో బీఆర్ఎస్ న్యాయవాది కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో పార్టీ పిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చాంబర్‌లో విచారణ జరిగింది.

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో పార్టీ పిరాయింపు ఎమ్మెల్యే (Party defection MLAs)ల అనర్హత పిటిషన్‌లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar) చాంబర్‌లో విచారణ జరిగింది. ఈ కేసులో బీఆర్ఎస్ తరపు న్యాయవాది సోమా భరత్ కుమార్ (Soma Bharath Kumar) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి క్రాస్ ఎగ్జామినేషన్ జరిగిందన్నారు. ఇప్పటి వరకు రావాల్సిన అనేక నిజాలు బయటకు వచ్చాయని తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సీఎం సమావేశమై.. క్రాస్ ఎగ్జామినేషన్ ఎలా ఎదుర్కోవాలో వివరించారని ఆరోపించారు.అందుకు సంబంధించిన ఫుటేజీ కావాలని ట్రిబ్యూనల్‌కు విజ్ఞప్తి చేశామన్నారు. రేపు పిటిషన్ రూపంలో దాఖలు చేస్తామని వెల్లడించారు.
జరిగిన ప్రొసీడింగ్స్ అన్నీ ఎవిడెన్స్, క్రాస్ ఎగ్జామినేషన్ పైనే జరిగాయన్నారు. ఇంకా అనేక మంది సాక్షులను విచారణకు తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. బార్బడోస్ లో స్పీకర్ల సమావేశానికి స్పీకర్ వెళ్తున్నారని, అందుకే ఈ నెల 24 కు తదుపరి విచారణ వాయిదా వేశారని పేర్కొన్నారు. మేం ఫిరాయించలేదని ఎమ్మెల్యేలు ఇంకా బుకాయిస్తున్నారని తెలిపారు. అబద్ధాన్నే ఆయుధంగా చేసుకొని మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఏది అడిగినా నిరాకరించడమే పద్ధతిగా పెట్టుకున్నారని, రాజీనామాలు చేసి కాంగ్రెస్ లోకి వెళ్లండి.. అభ్యంతరం లేదన్నారు. కానీ, ఇలా చట్టాలను తుంగలో తొక్కొద్దు, ఫిరాయింపు దారులు ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారు.? అని ప్రశ్నించారు.






