BRS: కాంగ్రెస్ ఈనో ప్రచారంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |

కాంగ్రెస్ పార్టీ(Congress Party) చేస్తున్న ఈనో(Eno) ప్రచారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) స్పందించారు.

BRS: కాంగ్రెస్ ఈనో ప్రచారంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ(Congress Party) చేస్తున్న ఈనో(Eno) ప్రచారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) స్పందించారు. దావోస్ పర్యటనలో(Davos Tour) భాగంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నాయకులు స్పందిస్తూ.. కేటీఆర్ కు కడుపు మంటగా ఉందని, ఆయన ఈనో తాగి ప్రశాంతంగా ఉండాలని ప్రచారం చేశారు. అంతేగాక నగరంలో పలు చోట్ల కేటీఆర్, కేసీఆర్ ఈనో తాగాలంటూ హోర్డింగులను ఏర్పాటు చేశారు. దీనిపై తెలంగాణ భవన్(Telangana Bhavan) లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు(Congress leaders) మొత్తం అబద్దాలే మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

నిన్న, మొన్న కేటీఆర్ ఈనో తాగాలి అని బయట అడ్వర్టైజ్‌మెంట్లు పెట్టారని అన్నారు. ఈ కాంగ్రెస్ సిపాయిలు పెట్టుబడులు తెచ్చారని చెప్పి, నాకు అజీర్తి అయ్యిందని ఈనో తాగాలని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు పెట్టుబడులు వచ్చి, ఉద్యోగాలు వస్తే సంతోషిస్తామని, అవన్నీ అవాస్తవాలు అనే విషయం ప్రజలకు తెలుసని చెప్పారు. అలాగే గత సంవత్సరం చెప్పిన 40 వేల కోట్ల పెట్టుబడుల్లో ఏవి కూడా ఇప్పటివరకు వాస్తవ రూపం దాల్చలేదని, కాంగ్రెస్ పార్టీ ఆరు గంటల మాదిరి.. ఈ పెట్టుబడులు కూడా అంతే అని ప్రజలు బలంగా నమ్ముతున్నారని స్పష్టం చేశారు. ఇక రేవంత్ రెడ్డికి దమ్ముంటే రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడులు ఎప్పటిలోగా పూర్తి అవుతాయో చెప్పాలని, ఎప్పటిలోగా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయో ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిజంగానే ఈ పెట్టుబడులన్నీ వాస్తవరూపం దాలిస్తే తామే సన్మానం చేస్తామని, కానీ అబద్ధాలు చెప్పవద్దని రేవంత్ రెడ్డిని కేటీఆర్ కోరారు.

Next Story