- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR : సిరిసిల్ల టీ స్టాల్ ఘటన పై కేటీఆర్ ఫైర్
సిరిసిల్ల(Sircilla)లో చిరు వ్యాపారి శ్రీనివాస్ టీస్టాల్(Tea Stall)ను జిల్లా కలెక్టర్ మూసివేయించిన(Closed)ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఫైర్ అయ్యారు. ప్రతీది గుర్తుపెట్టుకుంటున్నా(Everything shall be remembered)... ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తేలదేంటూ(Nothing will be forgotten. I assure you) ఎక్స్ వేదికగా హెచ్చరించారు.

దిశ, వెబ్ డెస్క్ : సిరిసిల్ల(Sircilla)లో చిరు వ్యాపారి శ్రీనివాస్ టీస్టాల్(Tea Stall)ను జిల్లా కలెక్టర్ మూసివేయించిన(Closed)ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఫైర్ అయ్యారు. ప్రతీది గుర్తుపెట్టుకుంటున్నా(Everything shall be remembered)... ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తేలదేంటూ(Nothing will be forgotten. I assure you) ఎక్స్ వేదికగా హెచ్చరించారు. పట్టణంలోని బతుకమ్మ ఘాట్‌కు ఉదయం మార్నింగ్ వాక్ వెళ్లి... అక్కడ టీ స్టాల్‌లో ఉన్న తన ఫోటో చూసి కలెక్టర్ సహించలేక శ్రీనివాస్ టీ స్టాల్ ను మూసివేయించాడని కేటీఆర్ మండిపడ్డారు.
కాగా ట్రేడ్ లైసెన్స్ లేదన్న కారణంతో టీ స్టాల్ తొలగించామని మున్సిపల్ అధికారులు చెబుతుండగా...టీ స్టాల్‌లో కేటీఆర్ ఫోటో తీసేయమన్న ఆదేశాలు వినకపోవడంతోనే కలెక్టర్ అలా చేశాడని యాజమాని శ్రీనివాస్ చెబుతున్నారు. టీ స్టాల్ పోయినా సరే... కేటీఆర్ ఫోటో తీయనని తేల్చి చెప్పడంతోనే తన టీ స్టాల్ మూసివేయించారని బాధితుడు ఆరోపిస్తున్నారు. నాలుగు ఏళ్లుగా బతుకమ్మ కుంట వద్ద బత్తుల శ్రీనివాస్ టీ స్టాల్ నడుపుకొని జీవిస్తున్నాడు.
ట్రేడ్ లైసెన్స్ లేకుండా టీ స్టాల్ నిర్వహించడాన్ని తప్పుబడుతూ హోటల్ మూసివేతకు కలెక్టర్ మున్సిపల్ అధికారులకు ఆదేశాలిచ్చారు. కలెక్టర్ ఆదేశాలతో శ్రీనివాస్ టీ స్టాల్ ముందే బైఠాయించిన మున్సిపల్ అధికారులు అతను హోటల్ మూసివేసేదాక అక్కడే ఉన్నారు. అధికారులు టీ స్టాల్ మూసివేతపై అతిగా వ్యవహరించారన్న విమర్శలు వినిపించాయి.






