BRS: ఆ విషయంలో మాట నిలుపుకోండి రేవంత్.. హరీష్ రావు సంచలన డిమాండ్

by Ramesh Goud |

ముఖ్యమంత్రి రుణ మాఫీ(Loan waiver) మాట నిలుపుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు(BRS Leader Harish Rao Thanneeru) డిమాండ్(Demand) చేశారు.

BRS: ఆ విషయంలో మాట నిలుపుకోండి రేవంత్.. హరీష్ రావు సంచలన డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రుణ మాఫీ(Loan waiver) మాట నిలుపుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు(BRS Leader Harish Rao Thanneeru) డిమాండ్(Demand) చేశారు. రుణమాఫీ కాలేదని పలువురు రైతులు తన వద్దకు వస్తున్న దృష్యాలను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆయన.. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు.. రైతులందరికీ రుణమాఫీ అయిపోయిందని ప్రచారం చేసుకుంటున్న రేవంత్ రెడ్డి.. అధికారుల చుట్టూ, బ్యాంకుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్న దుస్థితి మీకు కనిపించడం లేదా? అని నిలదీశారు. అలాగే అబద్ధపు ప్రచారం మీ రాజకీయ అవసరం తీరుస్తుందేమోగానీ, రైతుల ఆవేదన తీర్చదని మండిపడ్డారు. రుణమాఫీ కాలేదు అంటూ బాధలు చెప్పుకుంటున్న మెదక్ జిల్లా(Medak District) టెక్మాల్ మండల(Tekmal Mandal) రైతుల వివరాలను మీకు పంపుతున్నామని, రుణాలు మాఫీ చేసి ఈ రైతుల కన్నీళ్లు తుడవండి అని ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే(BRS MLA) కోరారు.

Next Story