- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహా టీవీ వివాదం.. బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం !
మహా టీవీ ఛానల్ పై (Maha TV Channel) దాడి జరిగిన విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రెండు తెలుగు

దిశ, వెబ్ డెస్క్ : మహా టీవీ ఛానల్ పై (Maha TV Channel) దాడి జరిగిన విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులు, ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఈ సంఘటనపై చాలా సీరియస్ అయ్యారు. దాడి చేసింది మేమే అని అంటూ గులాబీ పార్టీ నేతలు... సోషల్ మీడియాలో తెగ పోస్టులు కూడా పెడుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో గులాబీ పార్టీ ( BRS Party) లీగల్ టీం కీలక నిర్ణయం తీసుకుంది.
మహా టీవీ యాజమాన్యానికి గులాబీ పార్టీ... లీగల్ సెల్ నోటీసులు పంపించింది. దాడి జరిగిన రెండు గంటల్లోనే లీగల్ నోటీసులు పంపింది గులాబీ పార్టీ. ఫోన్ టాపింగ్ కేసుకు సంబంధించి తమ పార్టీ నేతలపై అసత్య ప్రచారం చేస్తున్నారని.. ఇందులో స్పష్టంగా వెల్లడించింది. జర్నలిజాన్ని ప్రజా ప్రయోజనాల కోసమే వాడాలని ఆ సంస్థకు విజ్ఞప్తి చేసింది గులాబీ పార్టీ.
మహా టీవీ తమ విధానం మార్చుకోకపోతే పరువు నష్టం దావవేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చింది. అదే సమయంలో గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ( KTR) తప్పుడు కథనాలు ప్రసారం చేశారని సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు ఆ పార్టీ మహిళా నేతలు. దీంతో ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






