- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG News : సర్కారుపై మరో పోరుకు సిద్ధమవుతున్న గులాబీ పార్టీ
తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి(Irrigation Projects) ప్రభుత్వం కావాలని నిర్లక్ష్యం వహిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి(Irrigation Projects) ప్రభుత్వం కావాలని నిర్లక్ష్యం వహిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు. ముఖ్యంగా కాళేశ్వరం వంటి కీలక సాగునీటి ప్రాజెక్టులపై ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చూపిస్తోందని, రైతుల సమస్యలను పట్టించుకోకుండా రాజకీయ కుట్రలకు పాల్పడుతోందని కేటీఆర్ మండిపడ్డారు. ఈ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టేందుకు పార్టీ సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు.
ఈ పోరాటానికి BRS అధ్యక్షుడు కేసీఆర్(KCR) సారథ్యం వహిస్తారని, త్వరలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్తామని, ప్రజల గొంతుకగా నిలబడి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నట్టు వెల్లడించారు.






