- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ బీజేపీలో విలీనానికి ట్రయల్ రన్: మహేశ్ కుమార్ గౌడ్
బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటేనని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటేనని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో (Jubilee Hills by-election) బీఆర్ఎస్‍కు బీజేపీ సపోర్టు చేస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఆరోపించారు. ఇవాళ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన తాము అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ చేయని అనేక పనులు తమ ప్రభుత్వం చేసిందన్నారు. కాంగ్రెస్ పాలనలో అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు మంచిపేరు రాకుండా ఏ పని చేసినా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం ఖాయం అని ఈ రెండు పార్టీల విలీనానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓ ట్రయల్ రన్ అన్నారు. కిషన్ రెడ్డి, కేసీఆర్ మైత్రీ తెలియనిది కాదన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన పార్టీ కాంగ్రెస్ అయితే వాటిని అడ్డుకున్నది బీజేపీ అన్నారు. ఇతరుల కుటుంబ వివాదాల్లో తలదూర్చడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు లేదని ఇవాళ మాగంటి గోపీనాథ్ తల్లి స్వయంగా పీఎస్ లో ఫిర్యాదు చేశారని అన్నారు. గోపీనాథ్ తల్లి, కుమారుడు చేస్తున్న ఆరోపణలపై కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అన్నారు.






