1500 ఎకరాల్లో BRS భారీ బహిరంగ సభ.. ఆ ఏసీపీకి నేతల కీలక విజ్ఞప్తి

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్(BRS) పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఈసారి హన్మకొండ జిల్లాలో నిర్వహించాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించిన విషయం తెలిసిందే.

1500 ఎకరాల్లో BRS భారీ బహిరంగ సభ.. ఆ ఏసీపీకి నేతల కీలక విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఈసారి హన్మకొండ జిల్లాలో నిర్వహించాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభను హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించబోతున్నారు. శుక్రవారం సభ మైదానాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. సభ నిర్వహణకు అనుమతినివ్వాలని కాజీపేట ఏసీపీ(Kazipet ACP)కి దరఖాస్తు చేశారు. సభ నిర్వాహణకు సంబంధించి భద్రత ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ ఇతర అనుమతులు మంజూరులు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏసీపీని కలిసిన వారిలో ఉమ్మడి వరంగల్(Joint Warangal) జిల్లా నాయకులు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, సతీష్ బాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, మాజీ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి తదితరులు ఉన్నారు.


వరుస ఓటముల నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లోని నైరాశ్యాన్ని తొలగించేందుకు భారీ స్థాయిలో రజోత్సవ వేడుకలు నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌(KCR) నిర్ణయించారు. ఏప్రిల్‌ 25, 26 తేదీల్లో హైదరాబాద్‌లో ప్లీనరీ(BRS Plenary) నిర్వహించాలని, 27న వరంగల్‌లో సుమారు ఐదు లక్షల మందితో భారీ సభ(Huge Public Meeting) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాలకు అనుసంధానంగా, అనువుగా ఉండే ఎల్కతుర్తి(Elkathurthy)ని ఎంపిక చేశారు. 1500 ఎకరాల్లో సభ నిర్వహించబోతున్నట్లు సమాచారం.

Next Story