- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై బీఆర్ఎస్ కీలక సమావేశం.. మాజీ మంత్రి నివాసంలో నేతల చర్చలు
రాష్ట్రంలో జూబ్లీహిల్స్ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంది. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వ్యూహాలు రచిస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో (Jubilee Hills by-election) జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంది. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ (BRS), బీజేపీ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం బంజారాహిల్స్ శ్రీనగర్ కాలనీలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Former Minister Sabitha Indra Reddy) నివాసంలో ఉపఎన్నిక ఇన్‌చార్జ్‌ల కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నేతలు ఉపఎన్నిక ఏర్పాట్లు, ప్రచార వ్యూహాలు, బూత్ స్థాయిలో కార్యకర్తల సమన్వయం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై పార్టీ విజయాన్ని సాధించే దిశగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది. నాయకులు ఏకాభిప్రాయంతో, సమన్వయంతో ముందుకు సాగి పార్టీ విజయాన్ని సాధించేందుకు సంకల్ప బద్ధంగా పని చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు ఎల్. రమణ, నవీన్ కుమార్ రెడ్డి, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ మహేశ్ యాదవ్, స్థానిక నాయకులు అప్పు ఖాన్, వినయ్, పార్టీ నాయకులు, మహిళా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో షేక్‌పేట్ డివిజన్ నేతల సమావేశం..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యం లో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో షేక్ పేట్ డివిజన్ గులాబీ పార్టీ ఇంచార్జీలు సమావేశం నిర్వహించారు. ఉప ఎన్నికల్లో ప్రచార సరళి, పార్టీ విజయం కోసం అనుసరించాల్సిన విషయాలపై చర్చించారు.ఈ భేటీలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, చింత ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బిగాల గణేశ్ గుప్తా, జాజాల సురేందర్, ఇబ్రహీం, కార్తీక్ రెడ్డి, జైసింహ తదితరులు పాల్గొన్నారు.






