బీఆర్ఎస్ అధికారం మాత్రమే కోల్పోయింది.. పోరాడే తత్వాన్ని కాదు: కేటీఆర్

by Pooja |   (  Updated:2024-12-08 14:19:41  IST  )

బీఆర్ఎస్(BRS) పార్టీ అధికారం మాత్రమే కోల్పోయిందని, పోరాడే తత్వాన్ని కాదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అన్నారు.

బీఆర్ఎస్ అధికారం మాత్రమే కోల్పోయింది.. పోరాడే తత్వాన్ని కాదు: కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) పార్టీ అధికారం మాత్రమే కోల్పోయిందని, పోరాడే తత్వాన్ని కాదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అన్నారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్(Rasamayi Balakishan) రూపొందించిన షార్ట్ ఫిల్మ్‌ను శనివారం తెలంగాణ భవన్‌(Telangana Bhavan)లో విడుదల చేసిన కేటీఆర్.. మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా ఓడిపోయామని, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒక్క సీటు కూడా రాలేదని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)ను ఐదు నెలలు జైలులో పెట్టారన్నారు. గత సంవత్సరం బీఆర్ఎస్ కు అత్యంత గడ్డుకాలంగా ఉందన్నారు. పార్టీని స్థాపించి వచ్చే ఏప్రిల్ నెలతో 24 ఏళ్ళు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతుందని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలను నమ్మి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని, కానీ బీఆర్ఎస్ పై ప్రజలకు అభిమానం తగ్గలేదన్నారు. ఒక్క ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతకు గురైతుందన్నారు. కాంగ్రెస్‌లో చేరిన పదిమంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే అందులో ఒక్కరు కూడా గెలవరని కేటీఆర్ జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యను లేవనెత్తుతామని స్పష్టం చేశారు. గత సంవత్సర కాలంలో ఏం జరిగిందో ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా రసమయి బాలకిషన్ చూపించారన్నారు. ఈ షార్ట్ ఫిల్మ్ సూటిగా, సుత్తి లేకుండా ప్రజలకు అర్ధమయ్యే విధంగా తీశారని కేటీఆర్ అభినందించారు.


Click Here For Tweet..

Next Story