- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసింది : తుమ్మల
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) మరోసారి బీఆర్ఎస్(BRS) పై విమర్శలు చేసారు.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) మరోసారి బీఆర్ఎస్(BRS) పై విమర్శలు చేసారు. నేడు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసిందని మండిపడ్డారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఆర్థిక నష్టాలను పూడ్చడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, ఆర్థిక క్రమశిక్షణను పాటించకుండా అనవసర ఖర్చులు చేసారని అన్నారు.
అవినీతి, అక్రమ ఆర్థిక విధానాలతో రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని ఆరోపించారు. వాటిని సవరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తోందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని, గత ప్రభుత్వం విస్మరించిన సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు.






