బీఆర్ఎస్ సర్కార్ రైతు నోట్లో మట్టికొట్టింది.. కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు

by Kema Shiva Kumar |

పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ (BRS Government) అన్నదాతల నోట్లు మట్టి కొట్టిందని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) తీవ్ర ఆరోపణలు చేశారు.

బీఆర్ఎస్ సర్కార్ రైతు నోట్లో మట్టికొట్టింది.. కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ (BRS Government) అన్నదాతల నోట్లు మట్టి కొట్టిందని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) తీవ్ర ఆరోపణలు చేశారు. ఇవాళ ములుగు జిల్లా (Mulugu District) వెంకటాపూర్‌ (Venkatapur)లో భూభారతి రెవెన్యూ సదస్సులో మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్నం పెట్టే రైతు దేశానికి వెన్నుముక అని అన్నారు. కానీ గత సర్కార్ ‘ధరణి’ పోర్టల్‌ (Dharani Portal)ను తీసుకొచ్చిన రైతుల నోట్లో మట్టికొట్టిందని ఫైర్ అయ్యారు. దుక్కిదున్నే రైతును మోసి చేసి వారి భూములను అన్యాయంగా బడాబాబుల పేర పట్టాలు చేశారని ఫైర్ అయ్యారు. ధరణితో అసైన్డ్‌ భూములకు పట్టాలు పొంది పబ్బం గడుపుకున్నారని ఆరోపించారు. రైతులను మోసం చేయడానికే కేసీఆర్ (KCR) ధరణిని తీసుకొచ్చాడని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) తీసుకొచ్చిన ‘భూభారతి’ (Bhubharati)తో అన్నదాతలకు ఎలాంటి కష్టాలు ఉండబోవని, అధికారులే స్వయంగా ఇంటికి వచ్చి సమస్యలను పరిష్కరిస్తారని పేర్కొన్నారు. మధ్యవర్తులను నమ్మి రైతులు మోసపోవద్దు కొండా సురేఖ సూచించారు.

Next Story