తెలంగాణలో జెన్ జెడ్ వల్లే బీఆర్ఎస్‌కు సున్నా సీట్లు వచ్చాయి: కేంద్ర మంత్రి బండి సంజయ్

by Malleboina Mahesh |

భారత్ లో జెన్ జెడ్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన కేటీఆర్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చాడు.

తెలంగాణలో జెన్ జెడ్ వల్లే బీఆర్ఎస్‌కు సున్నా సీట్లు వచ్చాయి: కేంద్ర మంత్రి బండి సంజయ్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఓ ఛానల్ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేపాల్ జెన్ జెడ్ ఉద్యమం (Gen Z movement)పై యాంకర్ ప్రశ్నించగా.. భారత్ లో కూడా ఇలానే కంటిన్యూ ప్రభుత్వం ఉంటే.. జెన్ జెడ్ ఉద్యమం వచ్చే అవకాశం ఉందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అయితే అదే ఇంటర్వ్యూలో ఉన్న యువత కేసీఆర్ వ్యాఖ్యలను భిన్నంగా స్పందించి.. భారత్ లో జెన్ జెడ్ ఉద్యమం (Gen Z movement in India) వచ్చే అవకాశం, అవసరం లేదని తేల్చి చెప్పారు. దీనికి సమాధానంగా కేటీఆర్.. భవిష్యత్తులో చూద్దామని అన్నాడు. కాగా ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో పై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

ఈ క్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) ఎక్స్ వేదిగా స్పందిస్తూ.. కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బండి తన ట్వీట్‌లో "నేపాల్ జనరల్ జెడ్ బంధుప్రీతికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చారు. కానీ తెలంగాణలో మాత్రం జన్ జెడ్ ఉద్యమం మొదట బీఆర్ఎస్ పార్టీపైనే మొదలైందని, కేసీఆర్‌కు ఆయన పిల్లలను ఓటు వేయకుండా.. BRS ను లోక్‌సభ ఎన్నిక (Lok Sabha elections)ల్లో 0 సీట్లకు పరిమితం చేసి.. రాష్ట్రంలోని జెన్ జెడ్ యువత బీఆర్ఎస్ పాలన (BRS rule)ను అంతం చేశారు. దీంతో తెలంగాణలో ఈ నెపో వారసుడు తనకు అర్హమైన వాస్తవికతను పొందాడు."అంటూ బండి సంజయ్.. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

Next Story