- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం రేవంత్‌రెడ్డిపై ఎన్నికల సంఘానికి భారత రాష్ట్ర సమితి ఫిర్యాదు
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై భారత రాష్ట్ర సమితి (BRS) నేతలు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి, జూబ్లీహిల్స్ ఆర్ఓ ను కలిసి ఫిర్యాదు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై భారత రాష్ట్ర సమితి (BRS) నేతలు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి, జూబ్లీహిల్స్ ఆర్ఓ ను కలిసి ఫిర్యాదు చేశారు. కేసీఆర్ పై ఆయన అసభ్యకర వ్యాఖ్యలు చేశారని, ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. బీఆర్ఎస్, బీజేపీది ఫెవికాల్ బంధమని, కేసీఆర్ బీఆర్ఎస్ ను ఆ పార్టీకి తాకట్టు పెట్టారని సీఎం రేవంత్ అన్నారు. అందుకే కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించి 3 నెలలైనా ఇంతవరకూ స్పందించలేదని ఆరోపించారు. అలాగే జూబ్లీహిల్స్ లో మైనార్టీలను మభ్యపెట్టేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు.
ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన అనంతరం బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో కోడ్ ను ఉల్లంఘించారని ఆరోపించారు. ఆయన ఒక మతాన్ని కించపరిచేలా మాట్లాడారని, అందుకే రిటర్నింగ్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు. కోడ్ ఉల్లంఘించిన రేవంత్ పై ఈసీ చర్యలు తీసుకోవాలని, ప్రచారం నుంచి ఆయన్ను నిషేధించాలని డిమాండ్ చేశారు.






