రేపు మెదక్ లో బీఆర్‌ఎస్‌ రైతు మహాధర్నా

by Muthe.Rajitha |

బీఆర్ఎస్ పార్టీ(BRS Party) ఆధ్వర్యంలో రేపు మెదక్ లో రైతు మహాధర్నా నిర్వహించనున్నారు.

రేపు మెదక్ లో బీఆర్‌ఎస్‌ రైతు మహాధర్నా
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ పార్టీ(BRS Party) ఆధ్వర్యంలో రేపు మెదక్ లో రైతు మహాధర్నా నిర్వహించనున్నారు. గురువారం ఉదయం మెదక్ కలెక్టరేట్ ఎదురుగా ఈ భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. కాంగ్రెస్‌ సర్కార్‌ చేస్తున్న రైతు మోసాలపై మెదక్ వేదికగా బీఆర్‌ఎస్‌ జంగ్‌ సైరన్‌కు సన్నద్ధమవుతున్నదని గులాబీ పార్టీ పేర్కొంది. అసంపూర్తి రుణమాఫీ, కోతల రైతు భరోసాలతోపాటు బోనస్‌ ఎగవేత తదితర అంశాలపై రైతుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కలెక్టరేట్ వేదికగా ఈ మహాధర్నాకు పిలుపునిచ్చినట్టు వెల్లడించింది. ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao), మాజీ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవనున్నారు.

Next Story