- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MP Chamala: కమీషన్లకు కక్కుర్తి పడకపోతే ఇప్పుడు ఎంక్వైరీ కమిషన్ వచ్చేవి కాదు కదా?: చామల
బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవకతవకల మీద ఎంక్వైరీ జరుగుతున్నాయని ఇందులో కక్ష సాధింపు చర్యలు ఏముందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) ప్రశ్నించారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజల సొమ్మును దోచుకుంటే ఏజెన్సీలు దర్యాప్తు చేయడం తప్పా అని ప్రశ్నించారు. ఇవాళ మేము ఒళ్లు దగ్గర పెట్టుకుని పరిపాలన చేయకుండా తప్పులు చేస్తే రేపు మాపై కూడా కమిషన్లు వస్తాయన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న వారు ఏడాదిన్నర పరిపాలించిన మాపై ప్రస్టేషన్ తో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కేటీఆర్ కంటే మంచి ఇంగ్లీష్ వచ్చిన ప్రతిపక్షనాయుకులు చాలా మంది ఉన్నారని వారెవరు బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఇంతలా విషబీజాలు నాటలేదన్నారు. నిన్నటి వరకు దయ్యాలు అని మాట్లాడిన సిస్టర్ ఇవాళ సెంటిమెంట్ స్టార్ట్ చేశారని కేసీఆర్ (KCR) ఫ్యామిలీ డ్రామా ఎన్ని ఎపిసోడ్స్ అయినా నడుస్తుందన్నారు. ఒక్క దయ్యానికి నోటీసులు ఇస్తేనే తట్టుకోలేకపోతున్నారన్నారు. తెలంగాణ సమాజాన్ని 24 గంటలు తప్పుదోవ పట్టించాలనే ఆలోచనతోనే కేసీఆర్ కుటుంబం ఉందనే విషయం క్లియర్ గా అర్థం అవుతోందన్నారు.
ప్రభుత్వం బ్రహ్మండంగా పని చేస్తోందని అందుకే మాకు డైవర్షన్ పాలిటిక్స్ అవసరంలేదన్నారు. ప్రతిపక్షాలు తమ పాత్రను సక్రమంగా నెరవేర్చడం లేదని ప్రతిపక్ష నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, ఆయనకు అసెంబ్లీకి వచ్చే ఓపిక లేదన్నారు. మా సీఎం, మా మంత్రులు ప్రతిరోజు ప్రజల్లో ఉంటున్నారని ప్రతిపక్ష హోదా అంటే ట్విట్లు చేయడం కాదని సెటైర్ వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు సక్రమంగా నిర్మించి పంటలకు నీళ్లిస్తే ఇవాళ పీసీ ఘోష్ కమిషన్ రావాల్సిన అసరం ఏమొచ్చిందని నిలదీశారు. కాళేశ్వరం (Kaleshwaram) లాంటి ప్రాజెక్టును చైనా వంటి దేశాలే 18 ఏళ్లలో నిర్మిస్తాయని అలాంటిది కేసీఆర్ నాలుగేళ్లలోనే నిర్మించారని కేటీఆర్ (KTR) చెబుతున్నారంటేనే కమీషన్లు దండుకునేందుకే తొందరగా నిర్మించినట్లు అర్థం అవుతున్నదన్నారు. నాడు కమీషన్లకు కక్కుర్తి పడకుంటే నేడు పీసీ ఘోష్ కమిషన్ వచ్చేదే కాదన్నారు. ఇది కక్ష సాధింపు రాజకీయాలు కావని కేవలం మీరు చేసిన ఖర్మపాలనకు అనుభవిస్తున్న పరిస్థితి అన్నారు. కేసీఆర్ అయినట్లు మేము మోక్షగుండం విశ్వేశ్వరయ్యను నేను కాదల్చుకోలేదన్నారు. కేసీఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే కాళేశ్వరం కుప్పకూలిందని ఆరోపించారు.






