చంచల్‌గూడ జైలు నుంచి బాల్కసుమన్ విడుదల

by Naga Rani Yarlagadda |

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే.

చంచల్‌గూడ జైలు నుంచి బాల్కసుమన్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాక గురువారం సాయంత్రం ఆయన చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. బాల్కసుమన్ జైలు నుంచి బయటకు రావడంతో.. బీఆర్ఎస్ కార్యకర్తలు పూలదండలు వేసి.. ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఈ క్రమంలో జైలు పరిసరాల్లో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.

ఇటీవల బీఆర్ఎస్ నేతలతో నిర్వహించిన సమావేశంలో బాల్కసుమన్.. పార్టీ శ్రేణులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు, సింగరేణిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో అతనిపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాల్కసుమన్ పై దేశద్రోహం సహా పలు క్రిమినల్ కేసులు నమోదవ్వగా.. గతనెల 29న పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టులో హాజరు పరచగా.. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలతో చంచల్ గూడ జైలుకు తరలించారు. 25 రోజుల తర్వాత బెయిల్ రాగా.. తాజాగా జైలు నుంచి విడుదలయ్యారు.

Next Story