- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BRS: ప్రశ్నిస్తే గానీ మొద్దు నిద్ర వీడలే.. మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్
మంత్రి ఉత్తమ్ ఇప్పటికైనా మేల్కొన్నందుకు ధన్యవాదాలు అని, ప్రశ్నిస్తే గానీ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడలేదని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు(BRS Leader Harish Rao) వ్యాఖ్యానించారు.

దిశ, వెబ్ డెస్క్: మంత్రి ఉత్తమ్ ఇప్పటికైనా మేల్కొన్నందుకు ధన్యవాదాలు అని, ప్రశ్నిస్తే గానీ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడలేదని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు(BRS Leader Harish Rao) వ్యాఖ్యానించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. ప్రభుత్వంపై(Congress Government) ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన.. తాను పత్రికా సమావేశం పెట్టిన తర్వాతనైనా మేల్కొని మొన్నటి డేట్ జనవరి 22, 2025 తో లెటర్ రాసి, ఈరోజు విడుదల చేసినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు(Thanks) అంటూ ఎద్దేవా చేశారు. అలాగే మొన్న 22వ తేదీనే నిజంగా లేఖ రాసి ఉంటే, ఆ రోజే మీరు మీడియాకు ఇచ్చి ఉండే వారు కదా? అని, ఈరోజు వరకు దాచిపెట్టరు కదా? అని ప్రశ్నించారు.
గోదావరి, కృష్ణా, పెన్నా లింకింగ్ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి 15/11/2024న లేఖ రాస్తే, దాని నిధుల కొరకు 31/12/2024న మరొక లేఖ రాస్తే, మీరు ఈరోజు వరకు ఎందుకు స్పందించలేదని, ఉత్తరాలు ఎందుకు రాయలేదని, ఎందుకు ఆ ఉత్తరాలను విడుదల చేయలేదని నిలదీశారు. అంతేగాక గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై తన వ్యాఖ్యలను మీరు వక్రీకరించడం శోచనీయమని, తాను 200 టీఎంసీల నీరు తీసుకుపోతున్నారని ఎక్కడ అన్నాను అని, తీసుకుపోయేందుకు ప్రాజెక్టు రూపకల్పన చేస్తుంటే మీరు మౌనం వహిస్తున్నారని తప్పుబట్టానని వివరణ ఇచ్చారు. తెలంగాణ నీటి ప్రయోజనాల కోసం నేను ప్రశ్నిస్తే గానీ, మీ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడదనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని, 512-299 ఒప్పందం అనేది ఒకే ఏడాదికి అని మీరు విడుదల చేసిన డాక్యుమెంట్లలోనే స్పష్టంగా ఉందని, మంత్రి హోదాలో ఉండి ఎందుకు అబద్దాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒకవేళ 512-299 ఒప్పందం ఉండి ఉంటే.. సెక్షన్ 3 ప్రకారం, నీటి పంపకాలు అనే విషయం ఎందుకు ఉత్పన్నమైతదని, సెక్షన్ 3 కోసం బీఆర్ఎస్ ఎందుకు పట్టుబట్టిందని ప్రశ్నించారు. ట్రిబ్యునల్ సమావేశానికి మంత్రి హోదాలో హాజరైన మొదటి వ్యక్తి నేనొక్కడినే అని మరో అబద్దం చెబుతున్నారని, 2016లోనే ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్(KCR), ఇరిగేషన్ మంత్రిగా తాను ట్రిబ్యునల్ మీటింగ్ లో పాల్గొని తెలంగాణ పక్షాన కొట్లాడామని, మీటింగ్ మినట్స్(Meeting Minuts) లో ఉంటది చూసుకోవాలని స్పష్టం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్(Rayalaseema lift Irrigation) విషయంలోనూ నోటికి వచ్చిన అబద్దాలు చెప్పారని, బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Government) ఆ ప్రాజెక్టును వ్యతిరేకించలేదనేది పచ్చి అబద్దమని ఇదే అబద్దాన్ని పదే పదే చెబుతున్నారని అన్నారు. ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించిన నాటి నుంచే వ్యతిరేకిస్తూ పుంఖానుపుంఖాలుగా లేఖలు రాసామని, కేఆర్ఎంబీకి, కేంద్ర ప్రభుత్వానికి, జలశక్తి మంత్రి షెకావత్ కి ఎన్నో ఉత్తరాలు రాశామని, తాము చేసిన ఒత్తిడికి రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు చేయొద్దని జలశక్తి మంత్రి షెకావత్ కూడా ఏపీకి లేఖ రాసినట్లు గుర్తు చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం మౌనంగా ఉన్నదని చెప్పడం అవాస్తవమని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ద్వారా స్టే తెచ్చామని, సెకండ్ అపెక్స్ కౌన్సిల్ లో కూడా వ్యతిరేకంగా మాట్లాడినవి మీటింగ్ మినట్స్ లో ఉంటాయని, తాను పంపిస్తున్నా చూసుకోండి అని చెప్పారు. ఇప్పటికీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగి ఉన్నాయంటే అది బీఆర్ఎస్ చేసిన కృషి వల్లనే అన్నది దాచేస్తే దాగని సత్యమని నినదించారు. ఇక తాను మాట్లాడింది గోదావరి జలాల్లో జరుగుతున్న అన్యాయం గురించి అయితే, ఆ విషయం మాట్లాడకుండా ఏవోవో మాట్లాడి, డైవర్ట్ చేసే ప్రయత్నం చేసారని, మీరు చెప్పిన అబద్దాలకు పూర్తి వాస్తవాలతో పత్రికా సమావేశం నిర్వహిస్తానని, మీ అబద్దపు ప్రచారాన్ని పటాపంచలు చేస్తానని హరీష్ రావు వెల్లడించారు.






