- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BRS: అసహ్యంగా.. ఆ డబ్బు జోలికి పోవద్దు రేవంత్.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
కళ్యాణ లక్ష్మిని వడ్డీ వసూలు స్కీంగా మార్చడానికి సిగ్గులేదా అని, ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? రికవరీ ఏజెన్సీ నడుపుతున్నారా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ప్రశ్నించారు.

దిశ, వెబ్ డెస్క్: కళ్యాణ లక్ష్మిని వడ్డీ వసూలు స్కీంగా మార్చడానికి సిగ్గులేదా అని, ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? రికవరీ ఏజెన్సీ నడుపుతున్నారా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ప్రశ్నించారు. ఓ మహిళ కుమార్తె వివాహం అనంతరం పడిన కళ్యాణ లక్ష్మి(Kalyana Lakshmi) సొమ్మును సిరిసిల్ల(Siricilla) తెలంగాణ గ్రామీణ బ్యాంకు(telangana Gramina Bank) అధికారులు పంటరుణం కింద జమ చేసుకున్నారు. ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్.. ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన.. ఆడబిడ్డ పెళ్లి చెయ్యడం కష్టం కావొద్దని, కేసీఆర్(KCR) తీసుకొచ్చిన కల్యాణలక్ష్మి పథకాన్ని వడ్డీ వసూలు స్కీంగా(Intrest Recovery Scheme) మార్చడానికి సిగ్గులేదా? అని మండిపడ్డారు.
అలాగే వచ్చిన కల్యాణలక్ష్మి లక్ష రూపాయలలో 60 వేలు బ్యాంకుకి, 40 వేలు లబ్ధిదారునికా?, నువ్వు నడిపేది ప్రభుత్వమా(Government)? రికవరీ ఏజెన్సీనా(Recovery Agency)? అని నిలదీశారు. అంతేగాక అందరికీ రెండు లక్షల పంట రుణ మాఫీ చేసాము అని బాకాలు కొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) చెప్పాలని, సోంబాయి కన్నీటికి కారణం ఎవరు అని! ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు రావాల్సిన కల్యాణలక్ష్మి డబ్బులులో 60 వేలు ఎందుకు గుంజుకున్నారు అని!, తులం బంగారం అన్నారు.. ఆఖరికి కల్యాణలక్ష్మి డబ్బులులో కూడా కొర్రీలు పెడుతున్నారని సంచలన విమర్శలు చేశారు. ఇక దందాలు, వసూళ్లు మాత్రమే తెలిసిన రేవంత్(Revanth Reddy) కి ఒక చిన్న సలహా! అంటూ.. కనీసం ఆడపిల్ల పెళ్లి డబ్బుల జోలికి పోవద్దు! అని, వినడానికే అసహ్యంగా ఉంది! అని మాజీ మంత్రి రాసుకొచ్చారు






