- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వం.. పుస్తకాల మెంబర్‌షిప్‌నకు ఇక స్వస్తి
భారత రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదును డిజిటల్ రూపంలో చేయాలని నిర్ణయించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: భారత రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదును డిజిటల్ రూపంలో చేయాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. పుస్తకాలు ముద్రించి రాసే విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయించారు. సభ్యత్వం కోసం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందిస్తున్నారు. ఫోన్లో యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని ఎక్కడికక్కడ వివరాలు నమోదు చేస్తే హైదరాబాద్ సెంట్రల్ సర్వర్‌లో నిక్షిప్తం అయ్యే విధంగా చేస్తున్నారు. టెక్నాలజీ అందుబాటులో ఉన్నా ఇంకా పాతకాలపు విధానాలు ఎందుకునే ఉద్దేశం, పుస్తకాల్లో నమోదు చేసిన వివరాలను మళ్లీ కంప్యూటీకరించాలి.. దానికి ప్రత్యేకంగా ఆపరేటర్లను పెట్టి చేయించడం, వాళ్లు పేర్లలో చిన్న చిన్న తప్పులుగా ఎంటర్ చేయడం ఇదంతా జరుగుతుంటాయి.. ఇలా చేసే తప్పులు ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే వారి పేర్ల స్పెల్లింగ్‌లో తప్పులు ఉండటంతో ఒక్కోసారి సమస్యలు వస్తున్నాయి.
బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వం.. పుస్తకాల మెంబర్‌షిప్‌నకు ఇక స్వస్తివీటన్నంటికీ చెక్‌పెట్టడం, అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా మరో అడుగు ముందుకు వేయచ్చని అంచనా వేశారు. దీనికి సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. యాప్ తయారయిన తర్వాత ప్రయోగాత్మకంగా చూసి సభ్యత్వం మొదలుపెట్టనున్నారు. ఏప్రిల్ 10 కల్లా సభ్యత్వం మొదలుపెట్టాలని నిర్ణయించారు. దీనికి కమిటీ ఏర్పాటు చేయనున్నారు. మెంబర్‌షిప్ ప్రారంభమయ్యాక పార్టీ సంస్థాగత ఎన్నికలు అయ్యే వరకు పార్టీ ప్రతినిధులు ఉండరు. ఈ నేపథ్యంలో ఏప్రిల్10న తలపెట్టిన పార్టీ ప్రతినిధుల సభ ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27న భారీ బహిరంగసభకు సిద్ధమవుతున్నారు. ఈ సభ ఎక్కడ నిర్వహించాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని సమాచారం. పార్టీ రజతోత్సవ కమిటీని కూడా త్వరలో ప్రకటించనున్నారు. ఇందు కోసం పేర్లు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. త్వరలోనే కమిటీలను ప్రకటించనున్నారని సమాచారం.






