BRS: గ్రూప్-1 లోపాలపై ప్రభుత్వం వైట్ పేపర్ రిలీజ్ చేయాలి

by Gantepaka Srikanth |

గ్రూప్-1 పరీక్ష సరిగా జరగకపోవడం వల్ల విద్యార్థులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు.

BRS: గ్రూప్-1 లోపాలపై ప్రభుత్వం వైట్ పేపర్ రిలీజ్ చేయాలి
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రూప్-1, జీవో 46 బాధితులకు న్యాయం చేయాలి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్(Dasoju Shravan) డిమాండ్ చేశారు. శుక్రవారం మండలిలో ఈ రెండు అంశాలపై మాట్లాడారు. గ్రూప్-1 పరీక్ష సరిగా జరగకపోవడం వల్ల విద్యార్థులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. గ్రూప్-1 పరీక్షలో జరిగిన లోపాలపై ప్రభుత్వం వైట్ పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. JNTUలో మెయిన్స్ మూల్యాంకనం జరిగిందని RTI ద్వారా తెలిసిందని చెప్పారు. ఎన్నికల సమయంలో లక్షల మంది విద్యార్థులను ప్రభుత్వం వాడుకుంది.. అధికారంలోకి వచ్చాక వారిని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మన పిల్లలు కోర్టుల చుట్టూ తిరగకుండా ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కాగా, గ్రూప్‌-1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం తదితరాలకు సంబంధించిన వివాదంపై హైకోర్టు జనవరి 22న తీర్పు వెలువరించనుంది. గ్రూప్‌-1 పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయని, పారదర్శకత లోపించిందనే కారణాలతో మార్కుల తుది జాబితా, జనరల్‌ ర్యాంకులను రద్దు చేయడంతోపాటు జవాబుపత్రాలను పునర్‌ మూల్యాంకనం చేయాలని, లేనిపక్షంలో తాజాగా పరీక్షలు నిర్వహించాలంటూ గతంలో సింగిల్‌ జడ్జి తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.

Next Story