BRS: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి

by Gantepaka Srikanth |

ఫాంహౌజ్‌లో మానవ మృగాలు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడడం సరైంది కాదని.. ఆయనకు అధికారంతో ఒళ్లు కొవ్వెక్కిందని.. అందుకే బలుపు మాటలు మాట్లాడుతున్నారని.. వెంటనే క్షమాపణ చెప్పాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి డిమాండ్ చేశారు.

BRS: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫాంహౌజ్‌లో మానవ మృగాలు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడడం సరైంది కాదని.. ఆయనకు అధికారంతో ఒళ్లు కొవ్వెక్కిందని.. అందుకే బలుపు మాటలు మాట్లాడుతున్నారని.. వెంటనే క్షమాపణ చెప్పాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అహింస పద్ధతుల్లో తెలంగాణ తెచ్చిన మరో గాంధీ కేసీఆర్ అని కొనియాడారు. మృగత్వానికి ప్రతి రూపాలు కాంగ్రెస్ పాలకులేనని విమర్శించారు. ఎమర్జెన్సీతో ప్రజలను హాహాకారాలు చేపించిన ఇందిరాగాంధీ మృగత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. హామీలను నెరవేర్చడం చేతకాకే సీఎం రేవంత్‌రెడ్డి పిచ్చి భాష మాట్లాడుతున్నారని అన్నారు.

రాష్ట్రాన్ని సువర్ణ తెలంగాణగా మార్చిన కేసీఆర్‌పై అనుచిత భాష మాట్లాడితే ప్రజలు సహించరని హెచ్చరించారు. యూరియా ఇవ్వని అసమర్ధుడు ఓయూను ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలా చేస్తానడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజలను క్షోభ పెడుతూ మాయమాటలు చెబుతున్నారని ఆరోపించారు. పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ వంద సీట్లు గెలుస్తామంటుని అంటున్నారని.. ముందు పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి గెలిపించుకోవాలని సూచించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోతే సీఎంకు రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు. ప్రగతి భవన్ కంచెలు తీశామని చెబుతూ ఓయూలో కంచెలు ఎందుకు ఏర్పాటు చేశారు అని నిలదీశారు. మాజీమంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ఎక్కడికి వెళ్లినా కాళేశ్వరం పాట పాడుతున్నారని అన్నారు. సీఎంగా ఆయన విఫలమయ్యారని.. ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని చెప్పారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు జి.దేవిప్రసాద్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, పల్లె రవికుమార్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఉపేంద్రచారి పాల్గొన్నారు.

Next Story