Special Classes: కార్యకర్తలకు కేటీఆర్, హరీశ్‌రావు స్పెషల్ క్లాసులు.. ఎప్పుడంటే?

by Ramesh Naini |

తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు గులాబీ పార్టీ సిద్దమైంది.

Special Classes: కార్యకర్తలకు కేటీఆర్, హరీశ్‌రావు స్పెషల్ క్లాసులు.. ఎప్పుడంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు గులాబీ పార్టీ సిద్దమైంది. గత అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలైన బీఆర్ఎస్ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ స్థాయిలో గెలిచి సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తమపై కాంగ్రెస్ చేసే వ్యతిరేక ప్రచారాలను తిప్పికొట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీ బలోపేతానికి సైతం కృషి చేస్తోంది. ఈ ప్రక్రియలో ముందుగా పార్టీకి చెందిన స్టూడెంట్ వింగ్ బలోపేతానికి గులాబీ అధిష్టానం ప్రయత్నిస్తున్నట్లు కన్పిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 19వ తేదీన ఉప్పల్‌లోని ఒక ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), పార్టీ కీలక నేత హరీశ్‌రావు (Harish Rao) అధ్యక్షతన శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాలను తిప్పికొట్టేందుకు అవసరమైన విషయాలను (Brsv) బీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి కేటీఆర్, హరీశ్‌రావు స్పెషల్ క్లాసులు ఇవ్వనున్నారు. బీఆర్ఎస్‌వీని బలమైన విద్యార్థి సంఘంగా చేయాలని పార్టీ అధిష్ట్రానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story