- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అబద్ధాల కాంగ్రెస్ ఏడో గ్యారంటీ.. జాగో తెలంగాణ జాగో: బీఆర్ఎస్
అబద్ధాల కాంగ్రెస్ ఏడో గ్యారెంటీ అంటూ బీఆర్ఎస్ (BRS) చేసిన ఎక్స్ పోస్టును వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) రీపోస్ట్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: అబద్ధాల కాంగ్రెస్ ఏడో గ్యారెంటీ అంటూ బీఆర్ఎస్ (BRS) చేసిన ఎక్స్ పోస్టును వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) రీపోస్ట్ చేశారు. మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ (X) వేదికగా బీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది. రాష్ట్రంలో యూరియా (Urea Crisis) అడుగుతున్న రైతులను, భూముల కోసం పోరాడుతున్న ఆదివాసీల బిడ్డలను, ఉద్యోగాలు అడుగుతున్న నిరుద్యోగులను ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేయిస్తోందని ఆరోపించింది. రైతులు, నిరుద్యోగులు, బీఆర్ఎస్ నేతలపై కేసుల అంశాలపై వచ్చిన వార్తల క్లిప్పింగ్స్ ను బీఆర్ఎస్ ఈ పోస్టులో షేర్ చేశారు.
అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు, ఖమ్మం నుంచి జహీరాబాద్ వరకూ అధికార కాంగ్రెస్ అరాచక పాలన చేస్తోందని మండిపడింది. అధికారం కోసం అడ్డగోలు హామీలిచ్చిన కాంగ్రెస్ ను ఇప్పుడు వాటిని అమలు చేయాలని ప్రశ్నిస్తోంటే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతోందని వాపోయింది. కేసులు, అరెస్టులు, జైళ్లు తమ గొంతును నొక్కలేవని, నియంతలను నిలదీసి, ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిరంతరం ప్రశ్నిస్తామని, పోరాటం తెలంగాణ జన్మహక్కు అని తెలుపుతూ.. తెలంగాణ ప్రజలు ఇకనైనా మేల్కోవాలని పిలుపునిచ్చింది.






