BRS: దగాపడ్డ తెలంగాణ 36వ సారి! బీఆర్ఎస్ పార్టీ ఆసక్తికర ట్వీట్

by Ramesh Naini |

ఎక్స్ వేదికగా దగాపడ్డ తెలంగాణ 36 వ సారి అంటూ బీఆర్ఎస్ పార్టీ ఆసక్తికర ట్వీట్ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతిలో తెలంగాణ దగాపడ్డదని బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేసింది.

BRS: దగాపడ్డ తెలంగాణ 36వ సారి! బీఆర్ఎస్ పార్టీ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మరోసారి ఢిల్లీ (Delhi Tour) పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఎక్స్ వేదికగా దగాపడ్డ తెలంగాణ 36 వ సారి అంటూ బీఆర్ఎస్ (BRS) పార్టీ ఆసక్తికర ట్వీట్ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతిలో తెలంగాణ దగాపడ్డదని బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేసింది. పాలన గాలికొదిలి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెలుతున్నారని, కప్పం కడితేనే, పదవి ఉంటదని బీఆర్ఎస్ ఆరోపించింది. కాంగ్రెస్ అధిష్టానం మెప్పుపొందడానికి 36 సార్లు ఢిల్లీకి వెళ్ళిన రేవంత్ రెడ్డికి, (SLBC Tunnel) ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి 72 గంటలు అవుతున్నా ప్రమాదంలో చిక్కుకున్న వారి దగ్గరకు వెళ్ళే సమయం లేదని బీఆర్ఎస్ విమర్శించింది.

కాగా, ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నిన్న షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి ప్రయాణం అవుతున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై అధిష్టానంతో సీఎం చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్‌కు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలో నాలుగు సీట్లు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎమ్మెల్సీ సీటు కోసం కాంగ్రెస్‌లో ఎంతో మంది ఆశావాహులు ఎదురుచూస్తున్నారు.

Next Story