- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరిగేషన్డిపార్ట్మెంట్లో కోవర్టులు.. ఆ సమాచారంతా బీఆర్ఎస్ నేతలకు చేరవేత!
నీటిపారుదల శాఖలో బీఆర్ఎస్కోవర్టులు ఇంకా ఉన్నారని ప్రభుత్వ, అధికార వర్గాలు భావిస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: నీటిపారుదల శాఖలో బీఆర్ఎస్కోవర్టులు ఇంకా ఉన్నారని ప్రభుత్వ, అధికార వర్గాలు భావిస్తున్నాయి. సర్కారు తీసుకునే నిర్ణయాలు, శాఖాపరంగా కొత్తగా చేస్తున్న ఆలోచనలు ముందుగానే గులాబీ పార్టీకి చెందిన మాజీ మంత్రులకు షేర్ చేస్తున్నారని, దాన్ని బట్టే ప్రతిపక్ష పార్టీలు ప్రెస్‌మీట్‌లు పెడుతూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారని గుర్తించారు. సమాచారం చేరవేస్తున్న సదరు ఇంజినీర్లను గుర్తించేందుకు పనిలో సర్కారు నిమగ్నమైంది.
కీలక సమాచారం చేరవేత
కృష్ణా ప్రాజెక్టు, కేఆర్‌ఎంబీ నిర్ణయాలు, కాళేశ్వరం మేడిగడ్డ, తాజాగా బనకచర్ల ఇష్యూ.. ఇలా ఏది చూసినా.. ప్రభుత్వానికి సంబంధించిన కీలక, రహస్య సమాచారం మొత్తం కొందరు ఇంజినీర్లు బీఆర్ఎస్ నేతలకు చేరవేస్తున్నారని ప్రభుత్వంలోని కీలక వర్గాలు గుర్తించాయి. ఇన్ఫర్మేషన్ ప్రతిపక్ష నేతలకు ముందుగానే తెలియడంతో ప్రభుత్వ ఎత్తుగడలు, వ్యూహాలను వారు ముందే పసిగట్టి సర్కారును ఇరకాటంలో పెడుతున్నారని అధికారులు గుర్తించారు. ఒక్కోసారి ప్రభుత్వమే సెల్ఫ్‌డిఫెన్స్‌లో పడాల్సి వస్తున్నదని, ప్రతిపక్షానికి సమాధానం చెప్పుకోవడం, వివరణలు ఇచ్చుకోవడం.. కొన్ని సార్లు రాజకీయంగానూ తమకు నష్టం జరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది.
మాజీ మంత్రికి చేరిన ‘బనకచర్ల’ లేఖ
బనకచర్లపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికి రెండు సార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ లేఖలు మీడియాకు కానీ, కేంద్రానికి చేరక ముందే ప్రతిపక్ష పార్టీకి చెందిన మాజీ మంత్రికి చేరాయని అధికారులు గుర్తించారు. ఈ నెల 13న ఉత్తమ్.. బనకచర్ల ఇష్యూపై కేంద్రానికి లేఖ రాశారు. దానికి మీడియాకు ఆన్రికార్డులో కానీ, ఆఫ్‌ది రికార్డులో కానీ విడుదల చేయలేదు. కానీ కేంద్రానికి లేఖ చేరకముందే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రికి చేరిందని, ఆ లేఖలోని అంశాన్ని బట్టే ఆయన పవర్‌పాయింట్‌ప్రజెంటేషన్ ఇచ్చారని గుర్తించారు. దీంతో అధికార పార్టీ వర్గాలు ఒక్క సారిగా ఉలిక్కి పడ్డాయి.
కోర్టులను గుర్తించే పనిలో సర్కారు
ఇరిగేషన్డిపార్ట్మెంట్లో కోవర్టులు ఉన్నారని ఇంతకాలం అనుమానం ఉన్నా... తాజాగా ఉత్తమ్రాసిన లేఖ గులాబీ పార్టీకి చేరడాన్ని చూసి నిజమేనని ప్రభుత్వం, అధికారులు అంచనాకు వచ్చినట్టు తెలిసింది. వీటిని ఎవరు లీక్ చేస్తున్నారు? అనే దానిపై సీరియస్‌గా దృష్టి పెట్టింది. వీరు బీఆర్ఎస్ హయాంలో మేలు పొందిన వారా? ఒక వేళ మళ్లీ ఆ పార్టీ అధికారంలోకి వస్తే లబ్ధిపొందొచ్చని అంచనాతో సమాచారం చేరవేస్తున్నారా?.. అంత సర్వీస్ ఉన్న ఇంజినీర్లు ఎవరు..? ఎక్కడి నుంచి లీక్చేస్తున్నారు ?.. అని ఇంటెలిజెన్స్, ఇతర వర్గాల సాయంతో సేకరించే పనిలో సర్కారు నిమగ్నమయ్యారు. నిర్ధారణకు వచ్చాక వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది.






