- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీకి ధీటుగా బీఆర్ఎస్ కౌంటర్ పాలిటిక్స్
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది.

దిశ, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీజేపీ ఆందోళనలు, నిరసనలు చేస్తుంటే, వాటిని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ కౌంటర్ పాలిటిక్స్ ప్లే చేస్తోంది. దీంతో రాష్ట్రంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో బీర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయ యుద్ధం ఎలా ఉంటుందోననే చర్చ జరుగుతోంది.
బీజేపీకి దీటుగా ప్రణాళిక..
బీజేపీకి దీటైన సమాధానం ఇచ్చేందుకు తాము రెడీగా ఉన్నామని చెప్పేందుకు ప్రతి అంశంలో బీఆర్ఎస్ కౌంటర్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తోంది. టీఎస్పీఎస్సీ అంశానికి కౌంటర్ గా టెన్త్ పేపర్ లీకేజీ కుట్ర కేసు తెరమీదికి వచ్చిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే మోడీ హైదరాబాద్ టూర్ నేపథ్యంలో సింగరేణి ఆందోళనలకు ప్లాన్ చేశారన్న విమర్శలు వస్తున్నాయి. కేసుతో కసి తీర్చుకున్నారనే టాక్ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఎపిసోడ్‌లో ప్రభుత్వం టార్గెట్‌గా బీజేపీ ఆందోళనలు చేసింది.
పేపర్ లీకేజీలో మంత్రి కేటీఆర్ ప్రమేయం ఉందని ఆరోపించింది. సిట్ విచారణతో న్యాయం జరగదని, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ వరుస ఆందోళనలు, నిరసనలతో ఉక్కిరిబిక్కిరైన రాష్ట్ర ప్రభుత్వానికి టెన్త్ హిందీ పేపర్ అంశం కలిసి వచ్చిందన్న టాక్ ఉంది. బండి సంజయ్ టెన్త్ పేపర్లను లీకేజీ కోసం కుట్ర చేశారని ఆయనపై పోలీసులు కేసు పెట్టారు. మంగళవారం రాత్రి అరెస్ట్ చేసి, ఆ రాత్రంతా మూడు, నాలుగు జిల్లాలను తిప్పుతూ తమ కసి తీర్చుకున్నారని ప్రచారం జరిగింది.
లిక్కర్ కేసుకు కౌంటర్‌గా ఫామ్ హౌజ్ కేసు ..
ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ లీడర్ల ప్రమేయం ఉందని వార్తలు వచ్చిన కొత్తలోనే ఫామ్ హౌజ్ కేసు తెరమీదికి తెచ్చారన్న చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కేంద్ర బీజేపీ లీడర్లు ప్లాన్ చేశారని, నలుగురు నిందితులను పట్టుకున్నారు. ఈ కేసులో కేంద్ర బీజేపీ నాయకులు బీఎల్ సంతోష్ కు నోటీసులు ఇచ్చారు. ఆయన హైదరాబాద్‌కు వస్తే అరెస్ట్ చేసేందుకు ప్లాన్ జరిగినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. తీరా ఆ కేసును సీబీఐ అప్పగించాలని హైకోర్టు తీర్పు చెప్పడంతో సవాలు చేస్తూ ప్రభుత్వం సుప్రీంకు వెళ్లింది. ప్రస్తుతం ఆ కేసు సుప్రీం పరిధిలో ఉంది.
యశ్వంత్ సిన్హాకు మద్దతు...
గత ఏడాది జూలైలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరిగాయి. ఆ సమయంలోనే విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను బీఆర్ఎస్ హైదరాబాద్ కు పిలిచింది. ఆయనకు ఘన స్వాగతం పలికింది. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి జలవిహార్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
మోడీ పర్యటన రోజే సింగరేణి ఆందోళన..
శనివారం పీఎం మోడీ హైదరాబాద్ పర్యటన ఉంది. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, పరేడ్ గ్రౌండ్‌లో జరిగే పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటారు. అయితే దీనికి కౌంటర్‌గా బీఆర్ఎస్ సింగరేణి అంశంపై ఆందోళనకు ప్లాన్ చేసింది. కేంద్రం సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర చేస్తోందని మంచిర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, రామగుండం కేంద్రాల్లో మహాధర్నాలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది.






