- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BJP: రెచ్చగొట్టుడు కాదు.. దమ్ముంటే ఆ లెక్కలు బయటపెట్టండి.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పై బీజేపీ ఫైర్
బనకచర్ల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పై బీజేపీ మండిపడింది.

దిశ, డైనమిక్ బ్యూరో: బనకచర్ల (Banakacharla) ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు పోటీ పడి ప్రజలను రెచ్చగొడుతున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు (Kasam Venkateshwarlu) అన్నారు. నీటి వాటాల వినియోగం విషయంలో గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలం అయ్యాయని ఆరోపించారు. ఈ విషయం నుంచి తప్పించుకునేందుకు కేంద్ర ప్రభుత్వంపై నోటికి వచ్చినట్లు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఇవాళ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. బనకచర్లపై కేంద్ర ప్రభుత్వం న్యాయబద్ధంగా, సాంకేతికంగా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని అనవసరంగా ప్రజలను రెచ్చొగొట్టి విభేదాలు సృష్టించవద్దన్నారు. వాస్తవాలను ప్రజలకు చెప్పకుండా తప్పుడు మాటలు చెబుతూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర పర్యావరణ శాఖ బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులను ఇప్పటికే ఆపేసిందని గుర్తు చేశారు.
ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లాలంటే సీడబ్ల్యూసీ అనుమతి తప్పనిసరి అని, నీటి లభ్యతపై, అంతరాష్ట్ర జల వివాదాలపై అనుమతి తప్పనిసరి అని ఈ విషయాలన్నింటిని పక్కన పెట్టి నోటికి వచ్చిన విధంగా కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణానదిలో 299 టీఎంసీల నీళ్లు తెలంగాణకు వస్తాయి. కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిగా ఎలా ఉపయోగించుకోవాలో తెలియడం లేదన్నారు. కృష్ణానదిలో మనకు ఉన్న 299 టీఎంసీల వాటాలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇప్పటి వరకు ఎన్ని నీళ్లను వినియోగించుకున్నామో దమ్ము ధైర్యం ఉంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారు. పాలమూరు రంగారెడ్డి, ఎస్ఎల్ బీసీ, డిండితో పాటు ఏ ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేక బీఆర్ఎస్ పదేళ్ల పాటు నిద్రపోతే గత 18 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం గాఢనిద్రలో మునిగిపోయిందని విమర్శించారు. నీటి వాటల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కూడబలుక్కుని తెలంగాణకు ద్రోహం చేస్తున్నాయన్నారు.






