- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BRS: సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి బీఆర్ఎస్ ఫిర్యాదు
by Prasad Jukanti |
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన బీఆర్ఎస్ నేతలు సీఎంపై ఫిర్యాదు చేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills by-election) ప్రచారంలో భాగంగా ఓ వర్గం మీద రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు సరికాదని ఆయనపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎస్ఈసీకి (BRS complaint to SEC) ఫిర్యాదు చేసింది. ఇవాళ బీఆర్కే భవన్‍లో బీఆర్ఎస్ శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూధనాచారి పార్టీ నేతలతో కలిసి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారని అయితే ఆ దాడి చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని ఇవాళ బీఆర్ఎస్ నేతలు, మైనార్టీ నేతలు వేర్వేరుగా సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదులు చేశారు.
కాగా రేవంత్ రెడ్డిని నిన్న కూడా బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. బుధవారం జూబ్లీహిల్స్ ఆర్ఓ ను బీఆర్ఎస్ నేతలు కలిసి రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. కేసీఆర్‍పై ముఖ్యమంత్రి అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ఓ వైపు జూబ్లీహిల్స్ ప్రచారం హోరందుకున్న వేళ సీఎంపై బీఆర్ఎస్ గ్యాప్ గ్యాప్ ఫిర్యాదులు చేస్తుండటం రాష్ట్ర రాజకీయాలాల్లో ఆసక్తిగా మారింది.
Next Story






