- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముస్లింలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి.. ఎన్నికల అధికారికి బీఆర్ఎస్ ఫిర్యాదు
by Ramesh Naini |
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లింలపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు కోరారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: (Jubilee Hills Constituency) జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లింలపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ (BRS) నేతలు కోరారు. గురువారం బీఆర్కే భవన్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్‌రెడ్డిని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, మహమ్మద్ షకీల్ అమీర్, బీఆర్ఎస్ నాయకులు పల్లె రవికుమార్, కిశోర్‌గౌడ్, సల్మాన్‌ఖాన్, ఇతర మైనార్టీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా వారు ముస్లింలపై జరుగుతున్న దాడులు, ముస్లింలపై సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. తక్షణమే రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై చర్యలు తీసుకోవాలని కోరారు.
Next Story






