ఫంక్షన్ హాల్స్, కమ్యూనిటీ హాల్స్ బుకింగ్‌ను అడ్డుకోవాలి : ఈసికి బీఆర్ఎస్ ఫిర్యాదు

by Muthe.Rajitha |

జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్ల బల్క్ బుకింగ్ కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న యత్నాలను అడ్డుకోవాలని ఉపఎన్నిక రిటర్నింగ్ అధికారి సాయిబాబాకు బీఆర్ఎస్ నేతల బృందం ఆదివారం ఫిర్యాదు చేసింది.

ఫంక్షన్ హాల్స్, కమ్యూనిటీ హాల్స్ బుకింగ్‌ను అడ్డుకోవాలి : ఈసికి బీఆర్ఎస్ ఫిర్యాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్ల బల్క్ బుకింగ్ కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న యత్నాలను అడ్డుకోవాలని ఉపఎన్నిక రిటర్నింగ్ అధికారి సాయిబాబాకు బీఆర్ఎస్ నేతల బృందం ఆదివారం ఫిర్యాదు చేసింది. దొంగ ఓట్లు వేయించేందుకు వేరే ప్రాంతాల నుంచి జనాన్ని తెచ్చి ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లలో ఉంచే కాంగ్రెస్ కుట్రను అడ్డుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కె.కిశోర్‌గౌడ్, బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు వేణుగోపాల్‌రావు, చైతన్య, లాలారాం ఉన్నారు.

Next Story