Mahesh Kumar Goud : బీఆర్ఎస్ ఆత్మహత్య చేసుకుంది : టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

by Muthe.Rajitha |

తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) మరోసారి బీఆర్ఎస్ పార్టీ(BRS Party)పై విరుచుకు పడ్డారు.

Mahesh Kumar Goud : బీఆర్ఎస్ ఆత్మహత్య చేసుకుంది : టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) మరోసారి బీఆర్ఎస్ పార్టీ(BRS Party)పై విరుచుకు పడ్డారు. మంగళవారం గాంధీ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన మహేష్ కుమార్ గౌడ్ గులాబీ పార్టీపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో బీఆర్ఎస్ పనై పోయిందని విమర్శించారు. ఇక ఆ పార్టీ తట్టా బుట్టా సర్దుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ(BJP)కి మద్ధతు ఇస్తోందని దుయ్యబట్టారు. బీజేపీకి సపోర్ట్ చేస్తూ రాష్ట్రంలో గులాబీ పార్టీ ఆత్మహత్యకు పాల్పడుతోందని పేర్కొన్నారు. ఆ పార్టీ అధినేత ఫాంహౌసుకే పరిమితం అయ్యారని.. ఇక ఆ పార్టీ కొలుకోలేదని తెలిసి, కేసీఆర్(KCR) ఏమీ చేయలేని స్థితిలోకి వెళ్లిపోయారని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నామరూపాల్లేకుండా పోతుందని మహేష్ కుమార్ గౌడ్ తెలియ జేశారు.

Next Story