KCR: రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్

by Ramesh Naini |

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణలో శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.

KCR: రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహాశివరాత్రి (Maha Shivarathri) పర్వదినం సందర్భంగా (Telangana) తెలంగాణలో శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా (BRS) బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు గరళకంఠుని దీవెనలుండాలని కేసీఆర్ ప్రార్థన చేశారు. పవిత్ర శివరాత్రి సందర్భంగా శివ భక్తులు ఉపవాస దీక్షను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించడం హిందూ సంప్రదాయంలో ప్రత్యేకతను సంతరించుకుందని కేసీఆర్ అన్నారు.

దేశవ్యాప్తంగా శివాలయాలు, భక్తుల శివనామస్మరణతో మారుమోగుతాయన్నాయని తెలిపారు. గరళాన్ని తన కంఠంలో దాసుకుని ముల్లోకాలను కాపాడుతున్న ఆ ఉమాశంకరుని కరుణాకటాక్షాలు తెలంగాణ ప్రజలకుండాలని, సుఖ శాంతులతో జీవించేలా ప్రజలందరినీ దీవించాలని కేసీఆర్ ఆ మహాశివున్ని ప్రార్థించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Next Story