- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్ MLA అభ్యర్థి ఖరారు.. అప్పుడే అధికారిక ప్రకటన
by GSrikanth |
కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి దాదాపు ఖరారు అయ్యారు. మరోసారి సాయన్న కుటుంబానికే టికెట్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొగ్గుచూపారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి దాదాపు ఖరారు అయ్యారు. మరోసారి సాయన్న కుటుంబానికే టికెట్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొగ్గుచూపారు. ఆదివారం కంటోన్మెంట్ నియోజకవర్గ సీనియర్ నేతలతో ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అందరి అభిప్రాయాలు సేకరించిన కేసీఆర్.. సాయన్న రెండో కుమార్తె నివేదితను ఫైనల్ చేశారు. రెండ్రోజుల్లో నివేదిత అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా, కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ఇప్పటికే నివేదిత అనౌన్స్ చేశారు. స్థానిక బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల అభీష్టం మేరకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నివేదిత సోదరి, దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.
Next Story






