- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చక్రం తిప్పిన నిరంజన్ రెడ్డి..బీఆర్ఎస్ అభ్యర్థికి 2180 ఓట్ల మెజారిటీ
తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు బీఆర్ఎస్ అభ్యర్థి కర్రోళ్ల స్వప్న భాస్కర్. ఈ

దిశ, వెబ్ డెస్క్: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపించింది. అదే సమయంలో కొన్ని ప్రాంతాలలో గులాబీ అభ్యర్థులు కూడా ప్రభంజనం సృష్టించారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 2180 ఓట్ల భారీ మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి కర్రోళ్ల స్వప్న భాస్కర్ విజయం సాధించారు. జనరల్ మహిళ స్థానంలో ఎస్సీ మహిళా అభ్యర్థిని నిలబెట్టారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. వనపర్తి నియోజకవర్గం గోపాల్ పేట మండలకేంద్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ దూకుడును తట్టుకుని, తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు బీఆర్ఎస్ అభ్యర్థి కర్రోళ్ల స్వప్న భాస్కర్. ఈ గ్రామ పంచాయతీలో మొత్తం ఓటర్లు 4440 కాగా 4278 ఓట్లు పోల్ అయ్యాయి. చెల్లని ఓట్లు 114గా గుర్తించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎల్లెపోగుల సువర్ణకు 1049 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి స్వప్న భాస్కర్ కు వచ్చిన ఓట్లు 3229 కాగా మెజారిటీ 2180 ఓట్లు వచ్చాయి.






