- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భద్రాద్రి కొత్తగూడెం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం
భద్రాద్రి కొత్తగూడెం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్మహత్యయత్నం చేశారు. నిన్న కౌంటింగ్ సమయంలో అధికారులు అనేక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ 54వ డివిజన్ అభ్యర్థి పద్మ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్య యత్నం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్మహత్యయత్నం చేశారు. నిన్న కౌంటింగ్ సమయంలో అధికారులు అనేక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ 54వ డివిజన్ అభ్యర్థి పద్మ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్య యత్నం చేశారు. రీకౌంటింగ్‌కు అప్లై చేసుకున్నా అధికారులు నిరాకరించారని ఆమె సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు పద్మ కలెక్టర్‌కు లేఖ రాశారు.
పోల్ అయిన వెయ్యి ఓట్లలో మొదటి రౌండ్‌లో 418 ఓట్లలో 100 ఓట్ల కట్టను సిబ్బంది వెంకట్ నాయక్ లెక్కించకుండా తనవద్దే ఉంచుకున్నారని చెప్పారు. ఎన్నిసార్లు వాదించినా వినకుండా, లెక్కచేయకుండా తనతో బలవంతంగా సంతకం పెట్టించారని ఆరోపించారు. దీనిపై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. రీకౌంటింగ్ జరిపి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. అధికారపార్టీతో కలిసి తమకు అన్యాయం చేశామన్నారు. కలెక్టర్ కు లేఖ రాయడంతో పాటు పద్మ సెల్ఫీ వీడియోనున సైతం విడుదల చేశారు.






