- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డాబు కోసం మూగజీవిని హించించిన బీఆర్ఎస్ దున్నపోతులు.. బీజేపీ తెలంగాణ సంచలన ట్వీట్
బీఆర్ఎస్ పీఆర్ పైశాచికానికి ఓ మూగజీవి బలైందని బీజేపీ తెలంగాణ (BJP Telangana) ట్వీట్ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ పీఆర్ పైశాచికానికి ఓ మూగజీవి బలైందని బీజేపీ తెలంగాణ (BJP Telangana) ట్వీట్ చేసింది. వరంగల్ జిల్లా (Warangal District) ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ (BRS Silver Jubilee Meeting)కు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ సభ కోసం బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళుతున్నారు. ఇందులో కొందరు పాదయాత్రగా బయలుదేరి వెల్లగా.. మరికొందరు సైకిళ్లపై, బైకులపై, కార్లలో, ఎడ్లబండ్లలో తరలివెళ్లారు ఈ నేపథ్యంలోని సూర్యాపేట జిల్లాలో కొందరు వ్యక్తులు ఎడ్ల బండ్లను కట్టి ఐదు రోజుల క్రితమే బయలు దేరారు.
ఈ ఎడ్లబండ్ల యాత్రపై సర్వత్రా విమర్శలు ఎదురయ్యాయి. మీ సభ కోసం మండుటెండలో మూగజీవాలను కష్టపెడుతున్నారని బీఆర్ఎస్ పై పలువురు దుమ్మెత్తి పోశారు. ఆదివారం బీఆర్ఎస్ అని రాసి ఉన్న ఓ మూగజీవి రోడ్డుపై ప్రాణాపాయ స్థితిలో పడి ఉన్న వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసిన బీజేపీ.. బీఆర్ఎస్ పార్టీ (BRS Party)పై తీవ్ర స్థాయిలో మండిపడింది. దీనిపై బీజేపీ తెలంగాణ.. బరువు మోయలేక, ఎండను భరించలేక బీఆర్ఎస్ పీఆర్ (BRS PR) పైశాచికానికి నోరులేని ప్రాణి బలైంది! అని తెలిపింది.
అలాగే మొన్నటికి మొన్న హెచ్‌సీయు అటవీ ప్రాంతంలోని మూగ జీవాల రక్షణ కోసం మొసలి కన్నీరు కార్చిన బీఆర్ఎస్ నాయకులు.. నేడు తమ పార్టీ కార్యక్రమం కోసం అదే మూగ జీవులను హింసిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేగాక డాబు కోసం, డ్రామాల కోసం మూగ జీవులను హింసిస్తున్న బీఆర్ఎస్ పార్టీ.. మండుటెండలో సూర్యాపేట నుండి వరంగల్ (Suryapeta To Warangal)కి ఎడ్లబండ్లలో బయలుదేరిన బీఆర్ఎస్ దున్నపోతులు అని ఘాటుగా స్పందించింది.






