- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BRS: ఉనికి చాటుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ అవస్థలు.. రేపు నల్లగొండలో రైతు మహాధర్నా
నల్లగొండ(Nalgonda)లో బీఆర్ఎస్ పార్టీ(BRS Party) రైతు మహాధర్నా కార్యక్రమం నిర్వహించనుంది.

దిశ, వెబ్ డెస్క్: నల్లగొండ(Nalgonda)లో బీఆర్ఎస్ పార్టీ(BRS Party) రైతు మహాధర్నా కార్యక్రమం నిర్వహించనుంది. ఈ నెల 12 న చేపట్టబోయే ఈ ధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) హాజరు కానున్నారు. మరి కొద్ది రోజుల్లో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తమ ఉనికిని చాటుకునేందుకు తీవ్ర స్థాయిలో శ్రమిస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయాక జిల్లాల్లోని లోకల్ నాయకులతో పాటు పార్టీ కేడర్ సైతం బీఆర్ఎస్ కు దూరమయ్యారు. దీంతో ధర్నాలు, పోరాటాల పేరుతో పార్టీ కేడర్ ను తిరిగి దరి చేర్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. పార్టీ నేతలను ఓ వైపు అరెస్ట్ భయం వెంటాడుతున్నా.. కాంగ్రెస్ పార్టీ తప్పిదాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ బలం నిరూపించుకోవాలని చూస్తోంది.
ఇందుకోసం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాల వారిగా ధర్నాలు నిర్వహించి, లోకల్ బాడీ ఎన్నికల్లో తిరిగి పుంజుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల12న నల్లగొండలో రైతు మహధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి(BRS Leader Jagadeesh Reddy) సహా ఉమ్మడి జిల్లా పార్టీ నేతలు హాజరుకానున్నారు. ఈ ప్రోగ్రామ్ ను సక్సెస్ చేయడం కోసం ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున జనాన్ని తరలించాలని పార్టీ నేతలకు హుకూం జారీ చేసినట్లు తెలిస్తోంది. ఈ ప్రోగ్రాం సక్సెస్ అయితే జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటవచ్చని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్(Nagarjuna Sagar) ఆయకట్టు కింద ఉండటంతో రైతులకు ఇచ్చిన హామీల అమలులో లోపాలను లేవనెత్తాలని, దీంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి, రైతు సింపతీతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.






