- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gajjala Kantham: వాళ్ల అసలు రంగు కవితనే బయటపెడతారు: గజ్జల కాంతం
పదేళ్లు తెలంగాణను మభ్యపెట్టిన కేసీఆర్ కుటుంబం ఇప్పుడు సొంతింటి ఆడపడుచునే నడిరోడ్డుపైకి నెట్టేసిందని గజ్జల కాంతం విమర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇన్నాళ్లు తెలంగాణ ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను మభ్యపెట్టి మోసం చేసిన కేసీఆర్ కుటుంబం చివరకు సొంతింటి ఆడబిడ్డను సైతం మోసం చేసి నడిరోడ్డుపైకి నెట్టేసిందని ఇది కేసీఆర్ కుటుంబ చరిత్ర అని కాంగ్రెస్ నేత గజ్జల కాంతం (Gajjala Kantham) విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ (KTR), హరీశ్ రావు (Harish Rao) అసలు రంగును కవితనే బయటపెట్టబోతున్నదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత వ్యాఖ్యల నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఇన్నాళ్లు మేము వీరులం, శూరులం అంటూ విర్రవీగిన కేటీఆర్, హరీశ్ రావు ఇప్పుడు సొంత ఇంటి ఆడపడుచును ఇంటి నుంచి వెలివేసి నడిరోడ్డుపై వదిలేసి ఎటువెళ్లారని నిలదీశారు.
కవితను స్వాగతిస్తున్నాం:
బీజేపీలో బీఆర్ఎస్ లో విలీనం చేయడానికి ఒప్పందం జరిగిందని కవితనే (Kavitha) చెబుతోందన్నారు. కవితకు ఈడీ నోటీసులు రాగానే హరీశ్ రావు, కేటీఆర్ బీజేపీ పెద్దలతో మాట్లాడుకున్నారని ఈ విషయం కవితనే చెబుతున్నారన్నారు. ఇప్పటికైనా కవిత నిజాయితీ వాస్తవాలు చెబుతోందని ఈ విషయంలో ఆమెను స్వాగతిస్తున్నామన్నారు. నీకు జరిగిన అన్యాయానికి మేము బాధపడుతున్నాం. ఇక్కడ పార్టీ నాశనం అవుతుంటే కేటీఆర్ అమెరికాలో మీటింగ్ పెట్టడం ఏంటని సెటైర్ వేశారు. తెలంగాణలో ఉన్న ప్రజలు కొట్లాడితే తెలంగాణ ఏర్పడిందా లేక అమెరికాలో ఉన్నవాళ్లు కొట్లాడిన వాళ్లు తెలంగాణ ఏర్పడిదా? దీన్ని బట్టి చూస్తే ఇక బీఆర్ఎస్ భూస్తాపితం అయిందని చెప్పకనే చెబుతున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. సొంత వ్యాపారాలు, కంపెనీలను చూసుకోవడం కోసమే కేటీఆర్ అమెరికా వెళ్లారని ఇది ఎంత దుర్మార్గం అని అన్నారు.






