BRS: అసెంబ్లీ, మండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు ఖరారు

by Gantepaka Srikanth |

మండలిలో పార్టీ విప్‌గా దేశపతి శ్రీనివాస్‌ను కేసీఆర్ నియమించారు.

BRS: అసెంబ్లీ, మండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు ఖరారు
X

దిశ, వెబ్‌‌డెస్క్: బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ, మండలికి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ల(BRS Deputy Floor Leaders)ను నియమించారు. అసెంబ్లీలో డిప్యుటీ ఫ్లోర్ లీడర్లుగా.. తన్నీరు హరీష్ రావు, పటోల్ల సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లను నియమించారు. శాసన మండలిలో డిప్యుటీ ఫ్లోర్ లీడర్లుగా ఎల్. రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని నియమించారు. మండలిలో పార్టీ విప్‌గా దేశపతి శ్రీనివాస్‌ను కేసీఆర్ నియమించారు. కాగా, అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి రోజు సమావేశంలో జీరో అవర్‌‌లో జిల్లాకు చెందిన పలువురు ప్రతినిధులు గళం విప్పారు. తమ నియోజకవర్గాల్లోని పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

Next Story