- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను గురువారం ప్రకటించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను గురువారం ప్రకటించింది. మల్కాజ్ గిరి, ఆదిలాబాద్ సెగ్మెంట్లకు పార్టీ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానానికి రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి ఆత్రం సక్కు పేరును ఖరారు చేశారు. లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని నేతలతో భేటీ అనంతరం అభ్యర్థులను అధినేత ప్రకటించారు.
ఇదిలా ఉంటే నిన్నటి వరకు మల్కాజ్‌గిరి పార్లమెంట్ టికెట్ ఎమ్మెల్సీ దాదాపు ఖరారు అయినట్లు వార్తలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో ఆయనకు అధిష్టానం షాక్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన రాగిడి లక్ష్మారెడ్డిని బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసి కేసీఆర్ అందరని ఆశ్చర్యానికి గురి చేశారు.






