Ponnam Prabhakar: యూరియా కొరత బీఆర్ఎస్, బీజేపీ కుట్ర: పొన్నం ప్రభాకర్

by Prasad Jukanti |

యూరియా కొరతపై మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Ponnam Prabhakar: యూరియా కొరత  బీఆర్ఎస్, బీజేపీ కుట్ర: పొన్నం ప్రభాకర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎరువుల విషయంలో తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఎరువుల కొరతతో రైతులు ఆందోళనలో ఉన్నారన్నారు. ఎరువుల తయారీ, సరఫరాపై పూర్తి ఆధిపత్యం కేంద్రప్రభుత్వాని దేనన్నారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. రైతుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత రావాలని ఉద్దేశపూర్వకంగానే బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కై ఈ రకంగా కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎరువుల సమస్య ఉందననేది వాస్తవం అని, ఎరువుల బాధ్యత వహించాల్సిన వాళ్లు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారని దుయ్యబట్టారు. క్షేత్ర స్థాయిలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏమీ లేదు:

రైతులకు సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏమీ లేదన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్దేశపూర్వకంగానే 4 నెలలుగా ఉత్పత్తి జరగట్లేదు. రామగుండంలో ఎరువులు ఉత్పత్తి చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి 11 లక్షల టన్నులకు గాను 5.2 లక్షల టన్నుల ఎరువులే వచ్చాయని ఎరువుల వైఫల్యం బాధ్యత బీజేపీ తీసుకావాలసిందేనన్నారు. రాజకీయ కక్ష ఉంటే రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులపై తీర్చుకోవాలి రైతులపై కాదన్నారు. రైతుల సహకారంతో బీజేపీకి వ్యతిరేకంగా ఒత్తిడి తెస్తామన్నారు. యూరియా ఎవరిస్తే వాళ్లకు ఇస్తామని కేటీఆర్ చెప్పారు. కేంద్రం యూరియా ఇవ్వడం లేదు కాబట్టి తెలుగు బిడ్డకు బీఆర్ఎస్ సభ్యులు ఓటు వేయాలన్నారు.

Next Story