- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీ రిజర్వేషన్లకు BRS, BJPలే అడ్డు.. టీపీసీసీ చీఫ్ హాట్ కామెంట్స్
తెలంగాణ (Telangana)లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు కోసం బీసీ జేఏసీ (BC JAC) ఈనెల 18న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana)లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు కోసం బీసీ జేఏసీ (BC JAC) ఈనెల 18న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నగరంలోని గాంధీ భవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) బీసీ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో కుల సర్వేలకు ఆద్యులు రాహుల్‌గాంధీ (Rahul Gandhi) అని కొనియాడారు. స్వాతంత్య్రం అనంతరం శాస్త్రీయంగా కుల సర్వే నిర్వహించి అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చామని అన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్ (Kamareddy Declaration)కు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తెలంగాణ బీసీ జేఏసీ బంద్‌కు తాము సంపూర్ణ మద్దతును ఇస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ప్రతి బీసీ ఈ బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ బంద్‌తోనైనా కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని మహేశ్ కుమార్ గౌడ్ కామెంట్ చేశారు.
బీసీ బిల్లు (BC Bill) బీజేపీ నేతలు అసెంబ్లీలో మద్దతు ఇచ్చి బయటకు వచ్చి మోకాలడ్డుతున్నాని మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. రాహుల్ గాంధీ ఎవరి వాటా వారికి నినాదం.. ఉద్యమంగా మారిందని అన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో న్యాయ పరంగా పోరాడుతామని తెలిపారు. రాజకీయాలు కేవలం ఎన్నికల వరకేనని.. రిజర్వేషన్ల విషయంలో అందరం ఏకం కావాల్సిన అవశ్యకత ఉందన్నారు. బీసీ రిజర్వేషన్లను రాజ్యంగంలోని 9వ షెడ్యూల్ చేర్చే విషయంలో ప్రధాని మోదీని అడిగేందుకు రాష్ట్రం బీజేపీ నేతలు ఎందుకు జంకుతున్నారని ప్రశ్నించారు. బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) లోపాయికారి ఒప్పందంతో బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని విధాలుగా పోరాడుతామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి తనకు ఉన్న సఖ్యత దేశంలో ఎక్కడా.. ఎవరి మధ్య లేదని అన్నారు. రాహుల్‌గాంధీ ఆశయ సాధన కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
కాగా, మంత్రి కొండా సురేఖ (Konda Surekha) విషయంపై సీఎంతో మాట్లాడామని మహేశ్ కుమార్ తెలిపారు. సురేఖనే డైరెక్ట్‌గా పిలిచి సీఎం మాట్లాడతానని చెప్పారని పేర్కొన్నారు. త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కారం అవుతాయని మహేశ్ కుమార్ గౌడ్ కామెంట్ చేశారు.






