- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజ్యసభలో బనకచర్లపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం
గోదావరి నదిపై బనకచర్ల ప్రాజెక్ట్(Banakacharla Project) నిర్మాణం పేరుతో ఏపీ సర్కారు చేస్తున్న జలదోపిడిపై చర్చకు బీఆర్ఎస్ పార్టీ(BRS party) రాజ్యసభ(Rajya Sabha)లో బుధవారం వాయిదా తీర్మానం(Adjournment Resolution) ఇచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : గోదావరి నదిపై బనకచర్ల ప్రాజెక్ట్(Banakacharla Project) నిర్మాణం పేరుతో ఏపీ సర్కారు చేస్తున్న జలదోపిడిపై చర్చకు బీఆర్ఎస్ పార్టీ(BRS party) రాజ్యసభ(Rajya Sabha)లో బుధవారం వాయిదా తీర్మానం(Adjournment Resolution) ఇచ్చింది. సెంట్రల్ వాటర్ కమిషన్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్, అపెక్స్ కౌన్సిల్ అనుమతులేవీ లేకుండానే ఏపీ ప్రభుత్వం బనకచర్లను నిర్మిస్తున్నదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేఆర్ సురేష్ రెడ్డి ఆరోపించారు.
గోదావరి నీళ్లను అక్రమంగా వినియోగించుకుంటూ.. తెలంగాణ నీటి హక్కులకు నష్టం కలిగిస్తున్నందున 267 పద్దు కింద సురేష్ రెడ్డి వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. అత్యవసర అంశం అయినందున బుధవారం నాటి సభా కార్యకలాపాలన్నింటినీ రద్దు చేసి బనకచర్ల అంశంపై చర్చించాలని ఆయన కోరారు. ఈ తీర్మానాన్ని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ తోసిపుచ్చి, చర్చకు నిరాకరించారు.






